AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి షాకింగ్ న్యూస్..

ఆర్బీఐ డిసెంబర్ 5న కొత్త వడ్డీ రేట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెపో రేటును 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గించింది. దీని వల్ల బ్యాంకులు లోన్లు, డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించనున్నాయి. కొత్తగా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసేవారికి నష్టమే.

Fixed Deposits: ఆర్బీఐ సడెన్ డెసిషన్..  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి షాకింగ్ న్యూస్..
Fixed Deposit
Venkatrao Lella
|

Updated on: Dec 09, 2025 | 6:35 PM

Share

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన విషయం తెలిసిందే. 5.50 శాతంగా ఉన్న రెపో రేటును 5.25 శాతానికి తగ్గించింది. దీని వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించనుండటంతో ఈఎంఐ తీసుకునేవారికి, కొత్తగా లోన్లు తీసుకునేవారికి బెనిఫిట్ జరగనుంది. అయితే ఈ పరిణామం బ్యాంకుల్లో డబ్బులను డిపాజిట్ల రూపంలో పొదుపు చేసుకునేవారికి నష్టం చేకూర్చనుంది. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా ఇతర స్కీమ్స్‌లలో పెట్టుబడి పెట్టేవారికి ఆ డబ్బులపై వడ్డీ తగ్గనుంది. దీని వల్ల మీకు వచ్చే రాబడి తగ్గుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గింపు

ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించనున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు ఇప్పుడు వెంటనే చేసుకోవడం మంచిది. బ్యాంకులు నుంచి వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన వచ్చేవరకు కంటే ముందుగానే డిపాజిట్ చేయడం వల్ల మీకు పాత వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టెన్యూర్ పూర్తయ్యే వరకు ఒకే వడ్డీ రేటు ఉంటుంది. అందుకే ఇప్పుడు తీసుకోవడం వల్ల మీకు అధిక వడ్డీ లభిస్తుంది. అందుకే త్వరపడి ఇప్పుడే చేసుకుంటే పాత వడ్డీ రేటు వర్తిస్తుంది. కొన్ని రోజులు ఆగితే ఆర్బీఐ నిర్ణయం ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. అప్పుడు మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే నష్టపోతారు.

ఎలా తగ్గుతుందంటే..?

ఉదాహరణకు మీరు రూ.5 లక్షలను 5 ఏళ్ల కాలవ్యవధికి 6 శాతం వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారనుకుందాం. 6 శాతం వడ్డీ అంటే మీకు ఐదేళ్ల తర్వాత రూ.6 లక్షల 78 వేల 427 అందుతాయి. అదే బ్యాంకులు వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే వడ్డీ రేటు 5.75కు పడిపోతుంది. దీని వల్ల మీకు రూ.6 లక్షల 65 వేల 182 మాత్రమే వస్తుంది. అంటే మీరు రూ.8,245 నష్టపోతారు. ఇక 6 శాతం వడ్డీతో రూ.10 లక్షల ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత రూ.13 లక్షల 46 వేల 855 వస్తాయి. అదే 5.75 శాతానికి వడ్డీ రేటు తగ్గిన తర్వాత చేస్తే రూ. 16 వేల వరకు నష్టపోతారు. ఇక రూ.15 లక్షల డిపాజిట్‌పై రూ.24 వేల వరకు నష్టపోయే అవకాశముంది. అందుకే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలనుకునేవారికి వెంటనే చేస్తే టెన్యూర్ తర్వాత అధిక రాబడి పొందవచ్చు.

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు