AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Ujjwala Scheme: ఫలిస్తున్న కేంద్ర చర్యలు.. ఐదేళ్లల్లో ఆ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రెట్టింపు

దేశంలోని మహిళలకు కట్టెల పొయ్యి బాధ పోగొట్టేందుకు కేంద్రం ఉజ్వల స్కీమ్ ద్వారా రాయితీలో గ్యాస్ సిలిండర్లను అందించింది. ఈ పథకంలో పెద్ద మొత్తంలో మహిళలు సిలిండర్లను తీసకున్నారు. కానీ క్రమేపి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి బాట పట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అవి కేవలం ఆరోపణలు మాత్రమే ఓ నివేదిక స్పష్టం చేస్తుంది.

PM Ujjwala Scheme: ఫలిస్తున్న కేంద్ర చర్యలు.. ఐదేళ్లల్లో ఆ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రెట్టింపు
Gas Cylinders
Nikhil
|

Updated on: Mar 25, 2025 | 1:23 PM

Share

దేశంలో గత ఐదేళ్లల్లో ఉజ్వల స్కీమ్ ద్వారా ఇచ్చిన సిలిండర్ రీఫిల్స్ బుకింగ్ రెట్టింపు అయ్యిందని, అలాగే లబ్ధిదారుల తలసరి వినియోగం సంవత్సరానికి దాదాపు నాలుగున్నర సిలిండర్లకు పెరిగిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. మార్చి 1, 2025 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద రీఫిల్ సిలిండర్లు ఐదు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 41.95 కోట్ల రీఫిల్‌లు పంపిణీ చేయగా 2023-24లో ఇప్పటికే 39.38 కోట్లకు పైగా రీఫిల్‌లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. 2019-20లో రీఫిల్‌ల సంఖ్య 22.80 కోట్లకు చేరుకుంది. ఇది ఐదు సంవత్సరాల క్రితం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 100% పెరుగుదలను చూపుతుందని స్పష్టం చేశారు.

పీఎంయూవై లబ్ధిదారుల తలసరి వినియోగం (సంవత్సరానికి తీసుకున్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల సంఖ్య పరంగా) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.68 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.95 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో (జనవరి 2025 వరకు) 4.43 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎంయూవై ప్రారంభించినప్పటి నుంచి ఓఎంసీలు ఫిబ్రవరి 2025 వరకు ప్రారంభ ఇన్‌స్టాలేషన్ రీఫిల్‌తో సహా మొత్తం 234.02 కోట్ల ఎల్‌పీజీ రీఫిల్స్‌ను పీఎంయూవై కస్టమర్లకు పంపిణీ చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంటే ఫిబ్రవరి 2025 వరకు ఓఎంసీలు రోజుకు సుమారు 12.6 లక్షల ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాయి ఆ నివేదికలో పేర్కొన్నారు.  

దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన వయోజన మహిళలకు డిపాజిట్ లేని ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) మే 2016లో ప్రారంభించారు. పీఎంయూవై కింద 8 కోట్ల కనెక్షన్లను విడుదల చేయాలనే లక్ష్యాన్ని 2019 సెప్టెంబర్‌లో సాధించారు. మిగిలిన పేద కుటుంబాలను కవర్ చేయడానికి ఉజ్వల 2.0 ఆగస్టు 2021లో ప్రారంభించారు. కోటి అదనపు పీఎంయూవై కనెక్షన్లను విడుదల చేయాలనే లక్ష్యంగా జనవరి 2022లో సాధించారు. తదనంతరం ఉజ్వల 2.0 కింద మరో 60 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 1.60 కోట్ల ఉజ్వల 2.0 కనెక్షన్ల లక్ష్యాన్ని కూడా డిసెంబర్ 2022లో సాధించారు. అలాగే 2023-24 నుండిచి2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎంయూవై కింద అదనంగా 75 లక్షల కనెక్షన్ల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ లక్ష్యం కూడా జూలై 2024 నాటికి సాధించారు.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..