AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..

ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే సబ్సిడీ విషయంలో అనేక నిబంధనలు ఉన్నాయి.

Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..
Solar
Venkatrao Lella
|

Updated on: Jul 18, 2026 | 1:55 PM

Share

విద్యుత్ ఛార్జీలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో సామాన్యులకు ఇవి పెద్ద భారంగా మారాయి. దీంతో సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని పేదల ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులను భారీగా తగ్గించుకోవచ్చు. ఈ ప్యానెల్స్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా అందిస్తోంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది. ఇంటిపై కాకుండా దుకాణం పైకప్పుపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేస్తే కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం.

దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ వస్తుందా..?

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం ప్రధానంగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచిత విద్యుత్ పొందటానికి సంబంధించినది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు. మీ దుకాణానికి వాణిజ్య (కమర్షియల్) విద్యుత్ కనెక్షన్ కలిగి ఉంటే.. PM సూర్య ఘర్ యోజన పథకం కింద అర్హత లభించదు. ఈ పథకం కేవలం నివాస గృహాల కోసం మాత్రమే అమలులో ఉంది. దీంతో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించదు. చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే ఈ పథకం కింద అర్హత పొందవచ్చు. విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా నమోదై ఉంటే సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అందదు. దీంతో సబ్సిడీ పొందాలంటే డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి.

సబ్సిడీ ఎంత వస్తుంది..?

సోలార్ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి  కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. 1 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ వ్యవస్థకు సుమారు రూ.30 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న వ్యవస్థకు సుమారు రూ.60 వేల వరకు ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల సోలార్ వ్యవస్థలకు గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర