Viral Video: ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. బుసలు కొట్టే నాగులను ఎలా పట్టేశాడో చూడండి
పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు.. ఇక అది కళ్ల ముందు కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా గుండె ఆగిపోతుంది. కానీ ఇక్కడో కుర్రాడు మాత్రం రెండు నాగుపాములు ఎదురొచ్చినా ఏమాత్రం భయపడకుండా.. ఎంతో చాకచక్యంగా వాటిని బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతోంది.

పామును చూస్తే చాలా మంది ఆమడం దూరం పరిగెడతారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం.. ఎలాంటి ఆయుధం లేకుండా ఏకంగా రెండు భారీ నాగుపాములను క్షణాల్లో పట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాడుబడిన ఇంట్లో రెండు భారీ నాగుపాములను గుర్తించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ఎలాంటి సేప్టీ పరికరాలు లేనప్పటికీ.. కేవలం చిన్న కర్రముక్క సహాయంతో వాటి దృష్టిని మళ్లించి.. ఎంతో చాకచక్యంగా ఆ రెండు భారీ నాగుపాములను కంట్రోల్ చేశాడు. అవి కాస్త శాంతించిన తర్వాత వాటిని పట్టుకొని మెళ్లగా.. సంచిలో బంధించాడు. నార్మల్‌గా పాములు కనిపిస్తే ఎవరైనా కొట్టి చంపేయాలని చూస్తారు. కానీ ఆ యువకుడు మాత్రం.. వాటిని గాయపరచడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. వాటిని బంధించి క్షేమంగా అక్కడి నుంచి తరలించాడు.
అయితే ఈ వీడియో ఓ యూజర్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్‌గా మారింది. నెట్టింట వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆ యువకుడి ధైర్య సాహసానికి సెల్యూట్ కొడుతున్నారు. అతను పాములను హింసించకుండా ఎంతో టెక్నిక్‌తో వాటిని లొంగదీసుకున్నాడని.. అది చాలా అద్భుతమైన ప్రతిభ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
చంపడం కాదు.. కాపాడటమే ముఖ్యం
నార్మల్‌గా ఏ పాములు మనుషులపైకి కావాలని రావు. అభివృద్ది పేరుతో వాటి నివాసాలైన అడవులను నరికివేయడం కారణంగా అవి నివాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తుంటాయి. తాజాగా నాగ్‌పూర్‌లోని ఓ పెళ్లి వేడుకలోకి కూడా ఇలానే పాము రావడంతో అందరూ భయపడిపోయారు.. సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మాత్రం.. దాన్ని చంపడానికి ఒప్పుకోలేదని, అవి ప్రకృతిలో ఎంతో ప్రత్యేకమైనవని చెప్పి సురక్షితంగా రక్షించాడని ప్రయత్నించాడు.
ఇలా వాటిని రక్షించడం ద్వారా ప్రజలకు రక్షణతో పాటు జీవావరణ సమతుల్యత కూడా దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు.. తొందరపడి వాటిపై దాడి చేయకుండా.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీడియో చూడండి..
Snake catcher in India calmly handles two massive cobras with his bare hands and a stick by u/Extension-Mess-6828 in interestingasfuck
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
