PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో కేంద్ర సర్కార్!
ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన మాత్రమే కాకుండా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.2,000 జమ చేస్తుంది. ఇప్పుడు వాయిదాల సంఖ్యను..

PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఒకటి. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గత సంవత్సరమే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.6000లను అందిస్తోంది. ఒకేసారి కాకుండా మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే వెలువడుతున్న నివేదికల ప్రకారం.. రైతులకు ఈ మొత్తాన్ని రూ.8,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.8000లను నాలుగు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సిఎన్‌బిసి టివి 18 వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. ఈ నివేదిక ప్రకారం లోక్‌సభకు ముందు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన మాత్రమే కాకుండా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.2,000 జమ చేస్తుంది. ఇప్పుడు వాయిదాల సంఖ్యను 3 నుంచి 4కి పెంచాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 15 వాయిదాలు ఇచ్చింది. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.2.75 లక్షల కోట్లు జమయ్యాయి. నవంబర్ 15న 15వ విడత రుణమాఫీ జరిగింది. గతంలో జూలై చివరి వారంలో 14వ విడత రుణమాఫీ జరిగింది. ఫిబ్రవరి 27న బెల్గాంలో జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ 13వ విడత విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




