AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post office: పోస్టాఫీసు స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో కీలక మార్పులు.. అవేంటో తెలుసా?

ఒక వేళ ఖాతాదారుడు ఏదైనా కారణంగా చనిపోయినా, ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డా డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక కుటుంబంలో ఒకరి పేరిట ఈ స్కీముకు సంబంధించిన ఖాతాను పోస్టాఫీస్‌లో తెరిస్తే.. మళ్లీ 3 నెలల వరకు మరొకరి పేరుమీద ఇంకో అకౌంట్‌ తెరిచేందుకు వీలుండదని గుర్తించుకోవాలి. ఇక ఈ పథకంలో వచ్చే వడ్డీకి టీడీఎస్‌ వర్తించదు. కానీ ఆర్థిక సంవత్సరంలో ..

Post office: పోస్టాఫీసు స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లలో కీలక మార్పులు.. అవేంటో తెలుసా?
Post Office
Subhash Goud
|

Updated on: Jan 09, 2024 | 6:38 AM

Share

కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసులను మరింతగా అభివృద్ధి చేస్తోంది. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాలు పోస్టాఫీసుల్లో కూడా అమలు అవుతున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం పోస్టాఫీసుల్లో ఉండే వివిధ పథకాలలో కీలక మార్పులు చేస్తోంది. వినియోగదారులకు మెరుగైన రాబడి అందించే విధంగా పలు పథకాల్లో మార్పులకు తెరదిస్తోంది. ఈత సంవత్సరం మోడీ ప్రభుత్వం పోస్టాఫీసుల్లో ఉండే స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు కస్టమర్లకు లాభాలు చేకూర్చే విధంగానే ఉన్నాయి. వడ్డీ రేట్లను మార్చడంతో పాటు వివిధ మార్పులు ఇందులో ఉన్నాయి. మరి ఆ మర్పులు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం..

  1. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌: గత సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర సర్కార్‌ దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మహిళలు, బాలికలనుద్దేశించి దీన్ని తీసుకువచ్చిన కేంద్రం.. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకం మెచ్యూరిటీ రెండు సంవత్సరాలు. వార్షిక వడ్డీరేటు 7.5 శాతం లభిస్తుంది. డిపాజిట్‌దారులు తమ అవసరాలనుబట్టి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత అందులో 40 శాతం వరకు తిరిగి పొందవచ్చు. అలాగే 6 నెలల తర్వాత 5.5 శాతం వడ్డీకి డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ ఖాతాదారుడు ఏదైనా కారణంగా చనిపోయినా, ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డా డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక కుటుంబంలో ఒకరి పేరిట ఈ స్కీముకు సంబంధించిన ఖాతాను పోస్టాఫీస్‌లో తెరిస్తే.. మళ్లీ 3 నెలల వరకు మరొకరి పేరుమీద ఇంకో అకౌంట్‌ తెరిచేందుకు వీలుండదని గుర్తించుకోవాలి. ఇక ఈ పథకంలో వచ్చే వడ్డీకి టీడీఎస్‌ వర్తించదు. కానీ ఆర్థిక సంవత్సరంలో రూ.40,000లకు మించి వడ్డీని పొందినట్లయితే టీడీఎస్‌ ఉంటుంది. అదే సీనియర్‌ సిటిజన్లకు రూ.50 వేల వరకు పరిమితి ఉంది. అపై మంచి వడ్డీ పొందిననప్పుడు మాత్రమే TDS చెల్లించాల్సి ఉంటుంది.
  2. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం..: 2023 బడ్జెట్‌లో సింగిల్‌ అకౌంట్‌ యూజర్ల కోసం ఈ స్కీమ్‌ డిపాజిట్‌ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. జాయింట్‌ ఖాతాదారుల కోసం అయితే రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.
  3.  సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ పథకం: ఎస్‌సీఎస్‌ఎస్‌లో గరిష్ఠ పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. తద్వారా మరింత డిపాజిట్లపై అధిక వడ్డీరేటును పొందే అవకాశాన్ని సీనియర్‌ సిటిజన్లకు కల్పించింది కేంద్రం ప్రభుత్వం.
  4.  PPFలో వడ్డీ గణనలో సవరణలు: PPF స్కీమ్‌లో 2019 కింద రెగ్యులర్‌గా జమయ్యే వడ్డీ కంటే 1 శాతం తక్కువగా ముందస్తు ఉపసంహరణ పథకాలపై వడ్డీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఐదేండ్ల బ్లాక్‌ పీరియడ్‌ నుంచి దీన్ని లెక్కిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6.  పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పెనాల్టీ: పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నిర్ణీత కాలవ్యవధి కంటే ముందే వెనక్కి తీసుకుంటే 2 శాతం వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సదరు ఎఫ్‌డీలకు నిర్ణయించిన వడ్డీరేటులో 2 శాతం తగ్గించి చెల్లిస్తారు.
  7. Senior Citizen Savings Scheme (SCSS)లో మార్పులు: అలాగే సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో కూడా మార్పులు చేసింది కేంద్రం. 55-60 ఏండ్లవారికి తమ రిటైర్మెంట్‌ ప్రయోజనాల పెట్టుబడికి 3 నెలల సమయం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ పథకంలో పెట్టుబడికి అర్హులు. అలాగే ఏడాదిలోపే ఖాతాను మూసేస్తే డిపాజిట్‌లో 1 శాతం మినహాయిస్తారు. స్కీం పొడిగింపుపై పరిమితులు ఎలాంటి పరిమితులు లేవు.

ఇక పోస్టాఫీసులో Small Savings Schemes

1. పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ (SB)

2. నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (RD)

3. నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (TD)

4. నేషనల్‌ సేవింగ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ (MIS)

5. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం అకౌంట్‌ (SCSS)

6. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF)

7. సుకన్య సమృద్ధి అకౌంట్‌ (SSA)

8. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ (NSC)

9. కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP)

10. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (MSSC)

ఈ విధంగా పోస్టాఫీసులు చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా పథకాలలో మీరు చేరాలంటే మీ సమీపంలో ఉన్న పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని అకౌంట్‌ తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి