Fake GST: 44 వేల కోట్లకుపైగా జీఎస్టీ ఎగవేత.. ప్రత్యేక డ్రైవ్‌లో వెలుగు చూసిన నిజాలు

జీఎస్టీ నమోదు ప్రక్రియను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ సమయంలో బయోమెట్రిక్ ఆధారిత సాధారణ ధ్రువీకరణ పైలట్ ప్రాజెక్ట్‌లు గుజరాత్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు. వస్తువులు, సేవల పన్నుకు అనుగుణంగా ఉండేలా ఈ ప్రచారం ప్రారంభించారు. నకిలీ ఐటీసీ వంటి జీఎస్టీ ఎగవేతను గుర్తించడానికి డేటా అనలిటిక్స్, రిస్క్ ప్రమాణాలు..

Fake GST: 44 వేల కోట్లకుపైగా జీఎస్టీ ఎగవేత.. ప్రత్యేక డ్రైవ్‌లో వెలుగు చూసిన నిజాలు
GST
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2024 | 9:47 AM

భారతదేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చి ఆరున్నరేళ్లు అవుతున్నా, దేశంలో పన్ను ఎగవేత కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. మే 2023 నుండి GST అధికారులు పన్ను ఎగవేతపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో రూ. 44,015 కోట్ల విలువైన GST ఎగవేతను గుర్తించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది కాకుండా, దేశవ్యాప్తంగా నకిలీ జీఎస్టీ చెల్లింపులదారులపై నిఘా వేశారు అధికారులు. ఈ డ్రైవ్‌లో 29,273 బోగస్ సంస్థలు అనుమానాస్పద పన్ను క్రెడిట్ ఎగవేతలో పాల్గొన్నాయని 121 మందిని అరెస్టు చేశాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గత ఏడాది మే నెలలో నకిలీ రిజిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు అధికారులు. మొత్తం 29,273 నకిలీ సంస్థలు రూ.44,015 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. GST మోసాలను అరికట్టడానికి, సమ్మతిని పెంచడానికి, కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లు, నకిలీ ఇన్‌వాయిస్‌ల జారీకి వ్యతిరేకంగా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌తో రూ. 4,646 కోట్లను ఆదా చేసింది. ఇందులో రూ.3,802 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిరోధించడం ద్వారా రూ. 844 కోట్లను రికవరీ ద్వారా ఆదా చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ కేసుల్లో 121 మంది అరెస్టులు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

జీఎస్టీ ఎగవేత కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానం:

ఇవి కూడా చదవండి

2023 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు రూ. 12,036 కోట్ల విలువైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేత జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. 4153 నకిలీ సంస్థల ద్వారా ఈ పన్ను ఎగవేత జరిగింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జిఎస్‌టి ఎగవేత కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 926 నకిలీ సంస్థలు రూ.2,201 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఘటనలు ఢిల్లీలో రూ.3028 కోట్లు పెరిగాయి. 483 నకిలీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఈ ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించారు?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ లేదా సీబీఐసీ బోర్డు దేశవ్యాప్తంగా నకిలీ రిజిస్ట్రేషన్‌లు చేసే వారిపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. జీఎస్టీలో అవకతవకలను అరికట్టేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. వాస్తవానికి కొన్ని నకిలీ కంపెనీలు వస్తువులు, సేవల ప్రాథమిక సరఫరా లేకుండా నకిలీ ఇన్‌వాయిస్‌లను జారీ చేయడం ద్వారా పన్ను ఎగవేస్తున్నట్లు కనుగొన్నారు.

డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో 4153 నకిలీ సంస్థలలో సుమారు రూ. 12,036 కోట్ల ఐటీసీ (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) ఎగవేత గుర్తించారు అధికారులు. వీటిలో 2358 నకిలీ సంస్థలు, కంపెనీలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీని వల్ల రూ.1317 కోట్ల ఆదాయం ఆదా అయింది. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేశారు.

జీఎస్టీ నమోదు ప్రక్రియను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ సమయంలో బయోమెట్రిక్ ఆధారిత సాధారణ ధ్రువీకరణ పైలట్ ప్రాజెక్ట్‌లు గుజరాత్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు. వస్తువులు, సేవల పన్నుకు అనుగుణంగా ఉండేలా ఈ ప్రచారం ప్రారంభించారు. నకిలీ ఐటీసీ వంటి జీఎస్టీ ఎగవేతను గుర్తించడానికి డేటా అనలిటిక్స్, రిస్క్ ప్రమాణాలు మొదలైనవి ఉపయోగించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి