Gold Price: తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు..మరింత క్షీణిస్తుందంటున్న నిపుణులు
కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది చివర్లో విపరీతంగా పెరిగిన పసిడి.. కొనుగోలుదారులను బెంబేలెత్తించినప్పటికీ ఈ మధ్య కాలంలో స్థిరంగా కొనసాగడం శుభ పరిణామమనే చెప్పాలి. అయితే ఈరోజు బంగారం ధరలు క్షీణించాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది చివర్లో విపరీతంగా పెరిగిన పసిడి.. కొనుగోలుదారులను బెంబేలెత్తించినప్పటికీ ఈ మధ్య కాలంలో స్థిరంగా కొనసాగడం శుభ పరిణామమనే చెప్పాలి. అయితే ఈరోజు బంగారం ధరలు క్షీణించాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 63,270 కాగా ఈరోజు రూ. 220 తగ్గి రూ. 63,050గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు రూ.57,800 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 200 తగ్గుదల కనిపించింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 తగ్గింది. నిన్న కిలో వెండి ధర రూ. 78,000 కాగా ఈరోజు రూ. 77,800 కు చేరింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర
- హైదరాబాద్..రూ. 63,050
- విజయవాడ..రూ. 63,050
- ముంబాయి..రూ. 63,050
- బెంగళూరు..రూ. 63,050
- చెన్నై..రూ. 63,600
10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర
- హైదరాబాద్..రూ. 57,800
- విజయవాడ..రూ. 57,800
- ముంబాయి..రూ. 57,800
- బెంగళూరు..రూ. 57,800
- చెన్నై..రూ. 58,300
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్..రూ. 77,800
- విజయవాడ..రూ. 77,800
- చెన్నై..రూ. 77,800
- ముంబాయి..రూ. 76,400
- బెంగళూరు..రూ. 73,500
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..