PM Kisan: పీఎం కిసాన్ పదో విడత అందలేదా.. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PM కిసాన్ సమ్మాన్ నిధి10వ విడతను జనవరి 1, 2022న విడుదల చేసారు. పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి

PM Kisan: పీఎం కిసాన్ పదో విడత అందలేదా.. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..
Follow us

|

Updated on: Feb 09, 2022 | 7:58 AM

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PM కిసాన్ సమ్మాన్ నిధి10వ విడతను జనవరి 1, 2022న విడుదల చేసారు. పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున మూడు వాయిదాలు చెల్లిస్తారు. ఇప్పుడు10వ విడతగా రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేశారు.

10వ విడతను ఇలా తనిఖీ చేయండి..

1. అధికారిక సైట్ www.pmkisan.gov.inని సందర్శించండి.

2. హోమ్‌పేజీలో ఇచ్చిన రైతు ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. ఆప్షన్ లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి.

4. మీ రాష్ట్రం, జిల్లా/సబ్ జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను ఎంచుకోండి.

5. గెట్ రిపోర్ట్ ఎంపికపై క్లిక్ చేయండి.

6. స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి.

7. మీ పేరును తనిఖీ చేసి నిర్ధారించండి.

8. pmksny హోమ్‌పేజీకి తిరిగి వెళ్లండి.

9. బెనిఫిషియరీ స్టేటస్ బటన్‌పై మళ్లీ క్లిక్ చేయండి.

10. మీ ఆధార్ కార్డ్ వివరాలు, లేదా మొబైల్ నంబర్ లేదా మీ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.

11. గెట్ డేట్ బటన్ పై క్లిక్ చేయండి.

12. మీ వాయిదా చెల్లింపు స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మీ ఇన్‌స్టాల్‌మెంట్ రాలేదంటే ఏం చేయాలి?

PM-KISAN పథకం కింద లావాదేవీల వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం అనేక కారణాలను గుర్తించింది. మూసివేసిన ఖాతాలు, చెల్లని IFSC కోడ్‌లు, నిష్క్రియ ఖాతాలు, గడువు ముగిసిన ఖాతాలు, బ్లాక్ చేసిన ఖాతాలు, స్తంభించిన ఖాతాలు, ఆధార్‌ నెంబర్‌ సరిగ్గా లేకపోవడం, నెట్‌వర్క్ వైఫల్యం మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఏదైనా తప్పు జరిగినట్లయితే పీఎం కిసాన్‌ డబ్బులు రావడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అభివృద్ధి చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకి అనుమతి ఇచ్చారు. తప్పులు సరిదిద్దాక పెండింగ్‌లో ఉన్న వాయిదాలు ప్రాసెస్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, UT పరిపాలన పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతు కుటుంబాలను గుర్తిస్తుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేస్తారు. పథకం కోసం వివిధ మినహాయింపు వర్గాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే రైతులు pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Nainital Bank Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు, క్లర్క్‌ పోస్టులు..

Viral Photos: రాత్రిపూట నక్షత్రాలు ఎక్కువగా కనిపించడం లేదు.. కారణం ఏంటో తెలుసా..?

Hijab Controversy: హిజాబ్ అంటే ఏమిటి.. దీనిపై కర్నాటకలో జరుగుతున్న రచ్చ ఏంటి..?