AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు అలర్ట్.. e-KYC అప్డేట్‏కు జూలై 31 చివరి తేదీ.. ఆన్‏లైన్.. ఆఫ్‏లైన్‏లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసా..

అన్నదాతలు e-KYC అప్డేట్ చేయడానికి జూలై 31 చివరి తేదీ అని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12 విడత నగదు పొందాలంటే

PM Kisan: రైతులకు అలర్ట్.. e-KYC అప్డేట్‏కు జూలై 31 చివరి తేదీ.. ఆన్‏లైన్.. ఆఫ్‏లైన్‏లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసా..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2022 | 10:51 AM

Share

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) ద్వారా దేశంలో అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఆర్థిక కల్పిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ ద్వారా రైతులకు వ్యవసాయ..సంబంధిత సామాగ్రి కొనుగోలు ఖర్చులకు తగిన సహాయం చేస్తుంది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6000 అందిస్తుంది. ఇవి ఒకేసారి కాకుండా ఏడాదిలో 3 విడతల వారిగా ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం డబ్బులు రావాలంటే రైతులంతా పీఎం కిసాన్ e-KYC అప్డేట్ చేయాల్సి ఉంటుంది..

అన్నదాతలు e-KYC అప్డేట్ చేయడానికి జూలై 31 చివరి తేదీ అని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12 విడత నగదు పొందాలంటే e-KYC అప్డేట్ తప్పనిసరిగా చేసింది. నిర్ణిత సమయంలోపు e-KYC అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. మరీ ఈ e-KYC అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందామా.

పీఎం కిసాన్ e-KYC అప్డేట్.. పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదిత రైతులకు e-KYC అప్డేట్ తప్పనిసరి. దీనిని ఓటీపీ ఆధారంగా కూడా పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదా బయోమెట్రిక్ ఆధారంగా కూడా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రాలల్లో అప్డేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

e-KYC అప్డేట్ ఆన్ లైన్ లో ఎలా అప్డేట్ చేయాలి.. * ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి. * ఆ తర్వాత మీరు కుడి వైపు ఉండే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * తర్వాత ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ స్టెప్ 4పై క్లిక్ చేయాలి. * అనంతరం ఆధార్ కార్డుతో అనుసంధించబడిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. * చివరగా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

e-KYC అప్డేట్ ఆఫ్ లైన్ లో ఎలా అప్డేట్ చేయాలి.. * ముందుగా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. * పీఎం కిసాన్ ఖాతా కోసం ఆధార్ అప్డేట్ సమర్పించాలి. * పీఎం కిసాన్ ఖాతాకు లాగిన్ అయ్యేందుకు బయోమెట్రిక్‏లను నమోదు చేయాలి. * ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసి.. ఫారమ్ సబ్మిట్ చేయాలి. * ఆ తర్వాత మీ ఫోన్ కు నిర్ధారణగా ఎస్ఎంఎస్ వస్తుంది.

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..