AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ కింద రైతుల అకౌంట్లోకి ఒకేసారి రూ.4 వేలు..? ఈ నెలలోనే.. కేంద్రం నుంచి అప్డేట్..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.4 వేలు ఒకేసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జూన్‌లో 23వ విడత నగదు విడుదల చేయగా.. త్వరలో 24వ విడత సొమ్మును రిలీజ్ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది.

PM Kisan: పీఎం కిసాన్ కింద రైతుల అకౌంట్లోకి ఒకేసారి రూ.4 వేలు..? ఈ నెలలోనే.. కేంద్రం నుంచి అప్డేట్..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 3:10 PM

Share

పీఎం కిసాన్ పధకం కింద ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో రూ.6 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. వీటిన మూడు విడతలుగా అందిస్తోంది. జూన్‌లో ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత కింద రూ.2 వేల చొప్పున లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి విడుదల చేసింది. ఇది 23వ విడత కాగా.. 24వ విడత సొమ్ము ఎప్పుడు అందుతుందనే విషయం రైతులు చర్చించుకుంటున్నారు. కేంద్రం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అక్టోబర్‌లో కేంద్రం రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 28న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఒకేసారి రూ.4 వేల జమ చేయనుందనే ఓ వార్త వైరల్ అవుతోంది.

స్పందించిన కేంద్రం

వైరల్ అవుతున్న వార్తపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB Fact Check స్పందించింది. వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఆగస్టు 28న రూ.4 వేలు విడుదలపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదని తెలిపింది. రైతులు ఇలాంటి వైరల్ వీడియోలు, ఫేక్ మెసేజ్‌లను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం పీఎం కిసాన్, PIB Fact Check ఫ్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే నమ్మాలని సూచించింది. ఇతర ఫ్లాట్‌ ఫామ్స్‌లో వచ్చే వార్తలను నిర్దారించుకోవాలని తెలిపింది. జూన్ 20న 23వ విడత నిధులు విడుదల అయ్యాయి.

అకౌంట్లోకి రూ.4 వేలు వస్తాయా..?

“రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకం కింద 24వ విడతగా రూ.4 వేలు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. PIBFactCheck ఈ ప్రచారం నకిలీదని, ఈ వీడియోను ఏఐ ఉపయోగించి సృష్టించారని ధృవీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. పీఎం-కిసాన్ పథకం 23వ విడతను 20 జూన్ 2026న మోదీ విడుదల చేశారు. 24వ విడతకు సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక సమాచారం కోసం https://pmkisan.gov.in వెబ్ సైట్ చూడండి. దయచేసి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. అటువంటి తప్పుదోవ పట్టించే, సంచలనాత్మక కంటెంట్‌ను నమ్మి మోసపోకండి. అలాగే వాటిని ఫార్వార్డ్ చేయకుండా ఉండండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద వీడియో లేదా సమాచారంపై 91 8799711259 వాట్సప్ నెంబర్ లేదా factcheck@pib.gov.in మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయండి.

Follow Us
పీఎం కిసాన్ కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.4 వేలు.. కేంద్రం అప్డేట్
పీఎం కిసాన్ కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.4 వేలు.. కేంద్రం అప్డేట్
వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..
వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..
వంద కేజీల స్వర్ణంతో శ్రీ మావుళ్లమ్మ.. దేశంలోనే అత్యధిక బంగారంతో
వంద కేజీల స్వర్ణంతో శ్రీ మావుళ్లమ్మ.. దేశంలోనే అత్యధిక బంగారంతో
శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో
శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో
సీనియర్ నటి షావుకారు జానకి మృతి..
సీనియర్ నటి షావుకారు జానకి మృతి..
చిమ్మ చీకట్లో గుహలు.. వణికించి భయపెట్టే ఓమర్ గుహల గురించి తెలుసా?
చిమ్మ చీకట్లో గుహలు.. వణికించి భయపెట్టే ఓమర్ గుహల గురించి తెలుసా?
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..