AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాట్లు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రావు.. ఏంటో తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అన్నదాతలకు

PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాట్లు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రావు.. ఏంటో తెలుసుకోండి..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2021 | 11:09 AM

Share

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అన్నదాతలకు ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నారు. అయితే ఏప్రిల్-జూలై మధ్య మొదటి విడత.. ఆగస్ట్-నవంబర్ మధ్య రెండవ విడత.. డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడతల వారిగా రూ. 2వేలు వారి అకౌంట్లలో జమచేస్తారు. అయితే ఈ పీఎం కిసాన్ నగదు వాయిదాల ప్రకారం ఆదార్ కార్డుతో లింక్ చేయబడిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మత్రమే పంపిణీ చేస్తారు. అయితే ఇప్పటికే 9 విడతల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. ఇందులో కొందరు అన్నదాతలకు ఈ నగదు రాలేదు. అందుకు కారణం.. వారి ఆధార్ నంబర్, ఖాతా నంబర్ వంటి ముఖ్య సమాచారన్ని తప్పుగా ఎంటర్ చేయడం.

ఒకవేళ మీ ఆధార్ నంబర్ తప్పుగా ఎంటర్ చేసినట్లుగా భావిస్తే.. వెంటనే మీరు పీఎం కిసాన్ వెబ్ సైట్‏కు లాగిన్ అయి వివరాలను మరోసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే.. 1. ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ pmkisan.gov.inకి లాగిన్ కావాలి. 2. ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. 3. అందులో ఆధార్ సవరణ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 4. అనంతరం మీ ఆధార్ నంబర్ చెక్ చేసి.. ఒకవేళ తప్పుగా ఉంటే సరిచేసే పేజీ ఓపెన్ చేయాలి. 5. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉంటే.. వెంటనే సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా లేఖఫాల్ ను సంప్రదించాలి.

పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలంటే సదరు రైతుకు 2 హెక్టార్ల వరకు భూమి ఉండాలి. రాజ్యంగ పదవులు ఉన్నవారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పదవి విరమణ పొందినవారు.. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వారు.. అలాగే నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్ ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఇదిలా ఉంటే.. పీఎం కిసాన్ 10వ విడత నగదు రైతుల ఖాతాల్లోకి డిసెంబర్ 15న రానున్నట్లుగా సమాచారం.

Also Read: Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..

Marakkar: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే మరక్కర్‌.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం

Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?