Property Registration: ఇల్లు లేదా పొలం కొనాలనుకొంటున్నారా? ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే రూ. లక్షల్లో ఆదా.. వివరాలు..

ప్రాపర్టీ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఎక్కడ రేటు తక్కువగా ఉంది? అది మంచి ప్రాంతమేనా? అన్ని వసతులు బాగున్నాయా? వంటి అనేక విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే అన్నింటికి కన్నా ప్రాధాన్యమైన ఓ అంశాన్ని మాత్రం మర్చిపోతుంటారు.

Property Registration: ఇల్లు లేదా పొలం కొనాలనుకొంటున్నారా? ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే రూ. లక్షల్లో ఆదా.. వివరాలు..
Home Loan
Follow us

|

Updated on: May 29, 2023 | 6:30 AM

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. నిజమే ప్రతి మనిషికి ఈ రెండు చాలా ప్రధాన్యమైనవి. ఇల్లు నిర్మించడం అంటే చాలా ప్రయోసతో కూడుకున్నది. చాలా ప్లానింగ్, ధనం అవసరం. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది రెడీమేడ్ వైపు మళ్లుతున్నారు. అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్లలో కొనుగోలు చేస్తున్నారు. మీరు ఒకవేళ అలాంటి ప్రాపర్టీ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఎక్కడ రేటు తక్కువగా ఉంది? అది మంచి ప్రాంతమేనా? అన్ని వసతులు బాగున్నాయా? రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది? భవిష్యత్తులో తిరిగి అమ్ముకోవాలంటే మంచి ధర వస్తుందా లేదా? వంటి అనేక విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే అన్నింటికి కన్నా ప్రాధాన్యమైన ఓ అంశాన్ని మాత్రం మర్చిపోతుంటారు. ఆ ఒక్కటి చేయడం వల్ల మీకు రూ. లక్షల్లో నగదు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి..

ఆ టిప్ ఇదే..

మీరు కొనుగోలు చేయాలనుకునే ఇల్లు లేదా పొలం వంటి ఏదైనా ప్రాపర్టీలను మీ తల్లి లేదా భార్య, కుమార్తె పేరు మీద కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనివల్ల ట్యాక్స్‌ బెనిఫిట్స్‌, స్టాంప్‌ డ్యూటీ, వడ్డీ రేట్లలో డిస్కౌంట్‌లను పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై), బ్యాంకులలో ప్రత్యేక ఆఫర్లు కూడా పొందవచ్చని సూచిస్తున్నారు.

ఇలా ఆదా..

దేశంలో పలు రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు హరియాణాలో స్థిరాస్తులు మహిళల పేరుపై కొంటే స్టాంప్‌ ట్యూటీ రెండు శాతం చెల్లించాలి. అదే పురుషుడి పేరుమీద ఉంటే ఏడు శాతం కట్టాలి. మిగిలిన రాష్ట్రాల్లో 5శాతం చెల్లించాలి. ఇద్దరు(భార్య, భర్త) సంయుక్తంగా ప్రాపర్టీపై పెట్టుబడి పెడితే స్టాంప్‌ డ్యూటీ ఒకశాతం తగ్గుతుంది. ఒకవేళ మీరు ఢిల్లీలో రూ. 50లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే.. ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆస్తిని మీ పేరుమీద రిజిస్టర్‌ చేసుకుంటే ఏడు శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే మీ భార్య పేరు లేదా తల్లి లేదా కుమార్తె పేరు మీద రిజిస్టర్‌ చేస్తే ఐదు శాతం మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేస్తారు. ఈ విధంగా లక్షల్లో రిజిస్ట్రేషన్‌ ఖర్చుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఆస్తిని భార్య పేరు మీద కాకుండా భర్త పేరు మీద జాయింట్‌గా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌లో ఒక శాతం రాయితీ పొందవచ్చు. దీని వల్ల రూ. 50,000 ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి

రుణాలు సులభంగా..

అంతేకాక మహిళ పేరుమీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఇంటి రుణాలు త్వరగా వస్తాయి. బ్యాంకులు సాధారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తాయి. పనిచేసే మహిళ లేదా మహిళా వ్యాపార వేత్తలు గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే, ఆమె ఆదాయాన్ని తన భర్త ఆదాయంతో కలిపి తీసుకుంటే అధిక రుణాన్ని పొందే వీలుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..