AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loan: కారు కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. బ్యాంక్ ఆఫర్లు చూస్తే మైండ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. ఊహకందని డిస్కౌంట్లు..

కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే పండుగల సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. అన్ని కంపెనీలు, డీలర్లు అద్భుతమైన ఆఫర్లు, ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నారు. ఒకవేళ కార్ లోన్ పెట్టి కొనుగోలు చేయాలనుకున్నా.. మార్కెట్లో బ్యాంకులు సైతం పండుగల డీల్స్ ప్రకటించాయి. పలు ఆఫర్లతో పాటు వడ్డీ రాయితీలు, క్యాష్ బ్యాక్ లు అందులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫన్లు, నో కాస్ట్ ఈఎంఐలు అందిస్తున్నాయి.

Car Loan: కారు కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. బ్యాంక్ ఆఫర్లు చూస్తే మైండ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. ఊహకందని డిస్కౌంట్లు..
Car Loan
Madhu
| Edited By: |

Updated on: Nov 04, 2023 | 8:00 AM

Share

కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే పండుగల సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. అన్ని కంపెనీలు, డీలర్లు అద్భుతమైన ఆఫర్లు, ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నారు. ఒకవేళ కార్ లోన్ పెట్టి కొనుగోలు చేయాలనుకున్నా.. మార్కెట్లో బ్యాంకులు సైతం పండుగల డీల్స్ ప్రకటించాయి. పలు ఆఫర్లతో పాటు వడ్డీ రాయితీలు, క్యాష్ బ్యాక్ లు అందులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫన్లు, నో కాస్ట్ ఈఎంఐలు అందిస్తున్నాయి. ఆర్థికంగా భారం కాకుండా ఉండాలనుకునే వారికి ఈ ఈఎంఐ ఆప్షన్ సరైన ఎంపికగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించాయి. కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న వారికి0.25శాతం అదనపు వడ్డీ రాయితీలను కూడా అందిస్తున్నాయి. అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ‘పీఎస్బీ అప్నా వాహన్ సుగమ్’ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం వరకు రాయితీని అందిస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేయొచ్చు. పలు బ్యాంకులు అందులో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

కొత్త కార్ లోన్ రేట్లు.. చార్జీలు..

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 5లక్షల కార్ లోన్ ను 8.75 – 10.50 వడ్డీ రేటుకు అందిస్తోంది. దీనిని ఐదేళ్ల లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దీనికి నెలవారీ ఈఎంఐ రూ.10,319 నుంచి రూ. 10,747 ఉంటుంది. ఈ లోన్ కు ప్రాసిసెంగ్ ఫీజు రూ. 1,000 వరకు ఉంటుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ. 5లక్షల కార్ లోన్ పై 8.75 శాతం నుంచి 9.60శాతం వరకూ వడ్డీ రేటు విధిస్తుంది. దీనిని ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి నెలవారీ ఈఎంఐరూ. 10,319 నుంచి రూ. 10,525 వరకూ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంపై 0.25% అంటే రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకూ తీసుకుంటారు.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5లక్షల కార్ లోన్ పై 8.70 శాతం నుంచి 12.10శాతం వరకూ వడ్డీ రేటు విధిస్తుంది. దీనిని ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ. 10,307 నుంచి రూ. 11,148 వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 500 వరకు ఉంటుంది.
  • కెనరా బ్యాంక్ లో రూ. 5లక్షల కార్ లోన్ పై 8.70శాతం నుంచి11.95శాతం వరకూ వడ్డ రేటు పడుతుంది. దీనిని ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ.10,307 నుంచి రూ.11,110 వరకూ పడుతుంది. దీనిపై 31 డిసెంబర్ 2023 వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 5లక్షల కార్ లోన్ పై 8.75 శాతం నుంచి 10.75 శాతం వరకూ వడ్డీ విధిస్తుంది. దీనిని ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ. 10,319 నుంచి రూ. 10,809 వరకూ పడుతుంది. దీనికి కూడా ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • యూకో బ్యాంక్ రూ. 5లక్షల కార్ లోన్ పై 8.45 శాతం నుంచి 10.55శాతం వరకూ వడ్డీ విధిస్తుంది. దీనిని ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ. 10,246 నుంచి రూ. 10,759 మధ్య ఉంటుంది. దీనికి కూడా ప్రాసెసింగ్ ఫీజు ఏమి ఉండదు.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 5లక్షల కార్ లోన్ పై 8.65 శాతం నుంచి 9.70శాతం వడ్డీ విధిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.10,294 నుంచి రూ. 10,550 మధ్య ఉంటుంది. దీనికి కూడా ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదు.

అదనపు ఆఫర్లు..

  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పటికే హౌసింగ్ లోన్ తీసుకున్న వారికి , కార్పొరేట్ శాలరీ అకౌంట్ హోల్డర్లకు 0.25% వడ్డీ రేటు రాయితీ అందిస్తోంది. దీనిలో వడ్డీ రేటు 8.70 శాతం నుంచి 13.00 మధ్య ఉంది.
  • పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న రుణగ్రహీతలకు 0.50% వడ్డీ రేటు రాయితీ అందిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ 4 వీలర్లకు ఫైనాన్సింగ్ కోసం రుణగ్రహీతలకు 0.20% వడ్డీ రేటు రాయితీ ఇస్తోంది. ఇప్పటికే హౌసింగ్ లోన్ ఉన్న రుణగ్రహీతలకు 0.20% రాయితీ అందిస్తోంది. కాగా ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.85శాతం నుంచి 10.25 శాతం వరకూ ఉంటుంది.
  • పీఎస్బీ అప్నా వాహన్ సుగమ్ పథకంలో ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు రాయితీ.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

కార్లు కాలక్రమేణా విలువను కోల్పోతాయని గుర్తించాలి. కాబట్టి పెద్ద రుణం తీసుకోవడం తెలివైన పని కాదు. మరోవైపు, తక్కువ రుణాలు పెద్ద నెలవారీ చెల్లింపులను కలిగి ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ పీక్స్ కావడంతో, భారతదేశం అంతటా కార్ డీలర్‌షిప్‌లు వివిధ మోడళ్లపై రూ.25,000 నుంచి రూ.లక్ష కంటే ఎక్కువ వరకు తగ్గింపును అందిస్తున్నాయి. ఈ తగ్గింపులు 2022 పండుగ కాలంలో అందించిన వాటి కంటే ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి