AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. మూడు రోజుల్లోనే..

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్

PF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. మూడు రోజుల్లోనే..
Epfo
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2021 | 10:43 PM

Share

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే వారికి కేవలం మూడు రోజుల్లోనే ఈపీఎఫ్ క్లైమ్ అయ్యేలా మార్పులు చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించేలా గతేడాది కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఆన్ లైన్ లో పీఎఫ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్ లైన్ లో పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసుకోవడం.. * ముందుగా UAN, పాస్ వర్డ్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వాలి. * ఆ తర్వాత ఆన్ లైన్ సేవలలో డ్రాప్-డౌన్ మెనులో ఉన్న ‘క్లెయిమ్ (ఫారం -31, 19 & 10 సి)’ ఎంపికను ఎంచుకోవాలి. * తరువాత పాన్ కార్డ్, అధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా నంబర్‌తో సహా మీ వివరాలను చూపిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నంబర్ యొక్క చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, ధృవీకరించుపై క్లిక్ చేయండి. * టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో కొనసాగింపు ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * పిఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31) ఎంచుకోవాలి. అయితే ఇందులో ముందుగానే ఎంచుకోవడానికి గల కారణాన్ని పేర్కొనాలి. కరోనాను ఒక కారణమని తెలిపితే తాత్కాలికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. * తర్వాత మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి.. అడ్రస్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు చెక్ లేదా.. అకౌంట్ వివరాలను అందులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * పీఎఫ్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ లో ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * మీ పీఎఫ్ అమౌంట్ ఈ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడానికంటే ముందు మీ ఓనర్ విత్ డ్రా పర్మిషన్ ఉండాలని గుర్తుంచుకోండి. * అత్యవసర పరిస్థితులలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మూడు రోజుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి అన్ని కేవైసీ పత్రాలను కలిగి ఉండాలి.

Also Read: కార్తీక దీపంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా.. మరోసారి టాప్‏లో వంటలక్క.. స్పందించిన డాక్టర్ బాబు.. మోనిత..

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి