Petrol-Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో మండుతోన్న ముడి చమురు ధరలు.. మరి మన దేశంలో పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభంతో రేట్లు పైకి ఎగబాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభంతో రేట్లు పైకి ఎగబాగుతున్నాయి. ఇదిలా ఉంటే యూపీతో సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడంతో దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.అయితే చాలా రోజులుగా ఉన్నట్లుగానే దేశీ మార్కెట్‌లో మాత్రం ఈరోజు కూడా పెట్రోల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. మరి ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అప్‌డేట్స్ ప్రకారం.. దేశీయంగా మార్చి 12వ తేదీ శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉండగా, డీజిల్ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్ పెట్రోల్ రూ. 109.98 కాగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో నేడు లీటర్ పెట్రోల్ రూ. 101.40 గా ఉంది, ఇక డీజిల్ రూ. 91.43 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 కాగా, డీజిల్ రూ. 85.01 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. * హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ రూ. 108.20 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48కాగా, డీజిల్ రూ. 96.56 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 109.40 లభిస్తుండగా.. ఇక డీజిల్ ధర విషయానికొస్తే రూ. 95.51 గా ఉంది.
Tirupati: తల్లి కన్నుమూసిందని తెలియక.. 4 రోజులుగా పాఠశాలకు వెళుతూ.. తిరుపతిలో హృదయ విదారక ఘటన..