Fuel Price Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హెచ్చుతగ్గులు..
Fuel Price Today: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...
Fuel Price Today: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 100 చేరుకుంటేనే సంచలనం అనుకున్న రోజులు దాటిపోయి ఇప్పుడు దేశంలో కొన్ని చోట్ల ఏకంగా రూ. 110కి చేరింది. అయితే గురువారం కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త హెచ్చు, తగ్గులు కనిపించాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. * దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84 గా ఉండగా, డీజిల్ రూ. 89.87 గా ఉంది. * ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83 వద్ద ఉండగా, డీజిల్ రూ. 97.45 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.67 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 94.55 గా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 105.25 గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 95.26 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
* హైదరాబాద్‌లో ఈరోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83 గా ఉండగా, డీజిల్ రూ. 97.96 గా ఉంది. * సిద్ధిపేటలో మాత్రం పెట్రోల్ ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 106.24 (బుధవారం రూ. 105.71) ఉండగా, డీజిల్ రూ. 98.32 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలోనూ పెట్రోల్ ధరలో స్వల్ప పెరుగుదల కనిపంచింది. గురువారం ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 108.25 (బుధవారం రూ. 108.01) కాగా, డీజిల్ రూ. 99.81 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్ ధర తగ్గడం విశేషం. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 106.80 (బుధవారం రూ. 107.52), డీజిల్ ధర రూ. 98.43 గా ఉంది.
Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం..!
Gas Cylinder Offer: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఈ బ్యాంక్ నుంచి క్యాష్‌బ్యాక్..!