Indigo former boss: రాకేష్ ఝంజువాలా క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామినవుతా.. ఇండిగో మాజీ బాస్ ఆదిత్య ఘోష్

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jul 29, 2021 | 12:34 PM

విమానయాన రంగంలో చౌక ధర టికెట్లకే ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు తానొక ప్రాజెక్టును చేపడతానని బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా చేసిన ప్రకటన పట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ మాజీ ప్రెసిడెంట్, పూర్తి స్థాయి డైరెక్టర్ ఆదిత్య ఘోష్ హర్షం ప్రకటించారు.

Indigo former boss: రాకేష్ ఝంజువాలా క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామినవుతా.. ఇండిగో మాజీ బాస్ ఆదిత్య ఘోష్
Rakesh Jhunjhuwala

విమానయాన రంగంలో చౌక ధర టికెట్లకే ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు తానొక ప్రాజెక్టును చేపడతానని బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా చేసిన ప్రకటన పట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ మాజీ ప్రెసిడెంట్, పూర్తి స్థాయి డైరెక్టర్ ఆదిత్య ఘోష్ హర్షం ప్రకటించారు. ‘ఆకాశా ఎయిర్’ పేరిట లాంచ్ కానుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో అప్పుడే ఏవియేషన్ నిపుణుడు వినయ్ దూబే కో-ఫౌండర్ అయ్యారు. ఈ ఎయిర్ లైన్స్ లో తాను సుమారు 35 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తానని రాకేష్ ఝంజువాలా ప్రకటించారు. ఇది 40 శాతమన్నారు. అయితే బోర్డులో ఇతర డైరెక్టర్లు కూడా ఉంటారన్నారు.2018 లో ఆదిత్య ఘోష్ ఇండిగో పేరెంట్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ నుంచి వైదొలిగారు. ఆయన పదేళ్ల పాటు ఇండిగో ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.ఆకాశ ఎయిర్ లైన్స్ లో తాను 10 శాతం పెట్టుబడి పెడతానని ఆయన వెల్లడించారు.

దీంతో ఈ ప్రాజెక్టు బోర్డులో ఆయన కూడా సభ్యునిగా కొనసాగనున్నారు.అయితే మేనేజ్ మెంట్ లో ఉండబోనని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్ వేస్ మాజీ బాస్ అయిన వినయ దూబే ఇందులో 15 శాతం ఇన్వెస్ట్ చేయనున్నారు.ఆయన సీఈఓగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ చౌక ధర ఏవియేషన్ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన సన్ కంట్రీ ఎయిర్ లైన్స్, ఎయిర్ బీ ఎన్ బీ కూడా ఇన్వెస్ట్ చేయనున్నాయి. అయితే ఈ సంస్థల పెట్టుబడి ఎంతో తెలియడంలేదు. తన ఎయిర్ లైన్ ప్రతిపాదనకు ఏవియేషన్ శాఖ నుంచి 15 రోజుల్లోగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నట్టు రాకేష్ ఝంజువాలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సుమారు 70 విమానాల ఫ్లీట్లతో తమ ఎయిర్ లైన్ ఉంటుందని ఆయన చెప్పారు. 180 మంది ప్రయాణికులు తమ విమానాల్లో ప్రయాణించవచ్చునని, మరో నాలుగేళ్లలో ఇది కార్య రూపం దాలుస్తుందని అయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి :సముద్రం అడుగున చిక్కిన ఏలియన్స్ ..!రష్యా చేపల వేటలో వింత చేప..ఏలియన్ రూపంలో..:Alien In Sea video.

 శివపురాణం ప్రకారం అద్భుత శక్తులు కలిగిన ఈ మహాకాళేశ్వరుడి దర్శనం… చూస్తే మాభాగ్యమే..!:Ujjayani Shivayya video.

 హే.. పోరా..! ఫ్యాన్‌పై పూజా ఫైర్..!ముంబైయి ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం..:Pooja Hegde in Mumbai Airport Video.

 ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu