Schools Re-open News: ఫీజుల కోసమే స్కూల్స్ రీ-ఓపెన్ అంటున్న పేరెంట్స్ … ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్న

Corona Virus: మానవ జీవితాలు ఇప్పుడు.. కరోనా కి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందేమో అన్నట్లు ఉంది.. పరిస్థితులు చూస్తుంటే... కోవిడ్ సృష్టించిన కల్లోలం అనేక రంగాలపై..

Schools Re-open News: ఫీజుల కోసమే స్కూల్స్ రీ-ఓపెన్ అంటున్న పేరెంట్స్ ... ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్న
Corona Schools
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 29, 2021 | 5:58 PM

Schools Re-open: మానవ జీవితాలు ఇప్పుడు.. కరోనా కి ముందు తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందేమో అన్నట్లు ఉంది.. పరిస్థితులు చూస్తుంటే… కోవిడ్ సృష్టించిన కల్లోలం అనేక రంగాలపై పడింది. ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోగా.. ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమకు రంగంతో పాటు అనేక రంగాలపై కోవిడ్ అత్యంత ప్రభావం చూపించింది. ముఖ్యంగా విద్యారంగం పై పెను ప్రభావం చూపించింది. విద్యార్థులు అత్యత విలువైన ఎడ్యుకేషన్ ఇయర్ అస్తవ్యస్తంగా మారింది. ఇక దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కొనసాగుకునే ఉంది.. ఆగష్టు నెలాఖరుకి థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఈ థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావంఫై చూపించనుందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూల్స్ పునప్రారంభంపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్పందించారు.. వివరాల్లోకి వెళ్తే..

కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు డెల్టా వైరస్ విజృంభించే అవకాశం ఉండనే వార్తలు వినిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కూడా పూర్తిగా కాలేదు .. దీంతో ఇప్పుడు పాఠశాలలు తెరిస్తే కరోనాతో మరింత ప్రమాదం ఏర్పడవచ్చునని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా స్టూడెంట్ ఎడ్యుకేషన్ కోసం పాఠశాలను తెరవడం తప్పనిసరి అయితే ముందుగా యూననివర్సిటీస్ తరగతులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం 8 వ తరగతి నుంచి స్కూల్స్ ప్రారంభించాలని తెలిపారు. పిల్లల ప్రాణాలను రిస్క్ లో పెట్టి స్కూల్స్ ప్రారంభించవద్దని.. వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నా ఎవరి నుంచి ఎప్పుడు కరోనా వస్తుందో తెలియడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పేరెంట్స్ ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తున్నారు. పిల్లల ఆరోగ్యంపట్ల జవాబుదారీతనం లేకుండా పాఠశాలల ప్రారంభించకూడదని అంటున్నారు. అంతేకాదు.. కరోనా థర్డ్ వేవ్ అంటూ హెచ్చరిస్తున్నా.. స్కూల్స్ రీ ఓపెన్ చేసేందుకు రెడీ అవుతున్నాయంటే.. ప్రయివేట్ స్కూల్స్ యాజమాన్యం పీజుల వసూలు చేసుకోవడం కోసం చేస్తున్న కుట్ర అంటూ తల్లిదండ్రులు అభివర్ణిస్తున్నారు.

ఇక దేశంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, హర్యానా ల్లో పాఠశాలలు ప్రారంభించారు. ఇక మరో నెలరోజుల్లో స్కూల్స్ రీ ఓపెన్ చేయడానికి . ఒడిసా, చత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ లు రెడీగా ఉన్నాయి. ఇక స్కూల్స్ రీ ఓపెన్ పై తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

Also Read:   రామప్ప ఆలయానికి నయా సొబుగులు.. ప్లాన్స్ సిద్ధం చేస్తున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్