Jharkhand Judge: ఝార్ఖండ్ లో జడ్జి దారుణ హత్య .. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు..
ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జి మృతి అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే ఈ జడ్జి హఠాత్తుగా మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి...
ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జి మృతి అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే ఈ జడ్జి హఠాత్తుగా మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి.. దీనిన రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన మరణించినట్టు చూపడానికి యత్నించినట్టు పోలీసులు కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇది స్పష్టంగా కనిపించింది. బుధవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కగా జాగింగ్ చేస్తుండగా ఆయనను వేగంగా వచ్చిన టెంపో ఢీ కొట్టి వెళ్ళిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఆ టెంపో కావాలనే ఆయన వెనుకవైపు నుంచి ఢీ కొంది.. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. ఈ సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆ టెంపో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ టెంపో కూడా దొంగిలించిందని గిరిధ్ పోలీసులు తెలిపారు.ఇది హత్యేనని నిర్ధారించారు. ధన్ బాద్ జిల్లాకోర్టు జడ్జి మృతి కేసును సుప్రీంకోర్టు తనకు తానుగా విచారించాలని ఈ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఇది ఓ కుట్ర ప్రకారమే జరిగిందని, ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడేనని ఈ అసోసియేషన్ పేర్కొంది. ఓ కేసులో ఈ జడ్జి బహుశా ప్రతివాదులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందువల్ల ఆయనపై పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్ లో పట్టపగలే నేరాలు పెరిగిపోతున్నాయని కానీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి :సముద్రం అడుగున చిక్కిన ఏలియన్స్ ..!రష్యా చేపల వేటలో వింత చేప..ఏలియన్ రూపంలో..:Alien In Sea video.
ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.