Today Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి? తాజా రేట్ల వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం, డిసెంబర్ 23న WTI క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శుక్రవారం, డిసెంబర్ 23న WTI క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలో క్షీణత నమోదైంది. ఇలా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న ఈ తరుణంలో ఈ రోజు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు చేసుకున్నాయా? లేదా అనేది తెలుసుకుందాం.
ఆయిల్ కంపెనీల వివరాల ప్రకారం.. పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పాత ధరల్లోనే కొనసాగుతున్నాయి. భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో ప్రధాన మార్పు మే 21, 2022న జరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గాయి. అప్పటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల ధరలలో పెద్దగా మార్పు లేదు.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
ఢిల్లీ- లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ. 89.62




చెన్నై – లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
కోల్‌కతా – లీటర్ పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ. 92.76
ముంబై- లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27
హైదరాబాద్- లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
తాజా పెట్రోల్-డీజిల్ ధరలను ఇలా తనిఖీ చేయండి
మీరు మీ నగరం పెట్రోల్-డీజిల్ ధరను తెలుసుకోవాలనుకుంటే మీరు SMS ద్వారా దాన్ని తనిఖీ చేయవచ్చు. HPCL కస్టమర్‌ల కొత్త ధరను తనిఖీ చేయడానికి, HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కు పంపండి. BPCL కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి, ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP <డీలర్ కోడ్>ని 9224992249కి పంపాలి. దీని తరువాత ధరల వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ తాజా పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేయడం చేస్తుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి