Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Debit: ఆటో డెబిట్ అంటే ఏమిటి? బిల్స్‌ పేమెంట్‌ కోసం ఈ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

ఇప్పుడు అంతా బిజీ.. బిజీ.. బిజీ.. ఉరుకులు పరుగుల జీవితం. ప్రతిరోజూ ఉండే హడావుడిలో అన్ని విషయాలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. ప్రతి నెల కట్టాల్సిన ఎలక్ట్రిక్ బిల్లు.. క్రెడిట్ కార్డ్ బిల్లు..

Auto Debit: ఆటో డెబిట్ అంటే ఏమిటి? బిల్స్‌ పేమెంట్‌ కోసం ఈ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
Auto Debit
Follow us
Subhash Goud

|

Updated on: Dec 20, 2022 | 12:47 PM

ఇప్పుడు అంతా బిజీ.. బిజీ.. బిజీ.. ఉరుకులు పరుగుల జీవితం. ప్రతిరోజూ ఉండే హడావుడిలో అన్ని విషయాలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. ప్రతి నెల కట్టాల్సిన ఎలక్ట్రిక్ బిల్లు.. క్రెడిట్ కార్డ్ బిల్లు.. ఫోన్ బిల్లు.. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు.. ఇలా ఎన్నో విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. బిల్లుల విషయంలో అయితే లాస్ట్ డేట్ గుర్తుంచుకోవడం పనుల ఒత్తిడిలో ఒక్కోసారి చాలా కష్టం అవుతుంది. ఇలాంటి వారికి ఆటో డెబిట్ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్ మెంట్‌ ప్లాన్- ఎస్ఐపిలు ఉండటంతో ప్రతి నెల బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంటుంది. అయితే ఆటో డెబిట్ పై చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఎకౌంట్ నుంచి డబ్బు డెబిట్‌ అయితే అదెందుకు కట్ అయిందో అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఆటో డెబిట్‌ విధానం ఎలా పనిచేస్తుంది.. దాని ప్రయోజనాలు, లోపాలను తెలుసుకుందాం.

ఎవరి బ్యాంకు ఎకౌంట్ నుంచి అయినా జరిగే ఆటో డెబిట్ వెనుక, ఈసీఎస్‌గా పిలవబడే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ఫీచర్ ఉంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈసీఎస్‌ అనేది ఒక బ్యాంకు ఎకౌంట్ నుంచి మరొక బ్యాంకు ఖాతాకు డిజిటల్‌ విధానంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి సులభమైన మార్గం. క్రెడిట్ సూయిస్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో డిజిట్ చెల్లింపులు 2023 నాటికి 82 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్‌) ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మంచి క్రెడిట్‌ స్కోర్ కలిగి ఉండాలంటే లోన్స్ లేదా ఇతర పేమెంట్స్ సకాలంలో చేయడం ముఖ్యం. మీరు వీటన్నింటిని ఈసీఎస్ ద్వారా చెల్లించవచ్చు. ఈ విధానం ద్వారా మీ చెల్లింపుల కోసం చెక్ ఇవ్వడం లేదా.. గడువు తేదీని గుర్తించుకోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఓ వ్యక్తి లోన్ తీసుకున్నప్పుడు, దాని ఈఎంఐ ప్రతి నెల ఈసీఎస్‌ ద్వారా తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా ఈఎంఐ ఎప్పుడు చెల్లించాలి. చెక్ బౌన్స్ కారణంగా పేమెంట్స్ ఫెయిల్ కావడం, పెనాల్టీలు పడటం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్ మెంట్‌ ప్లాన్- ఎస్ఐపి ద్వారా ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవలసి వస్తే, లేదా మీరు విద్యుత్, వాటర్, టెలిఫోన్ బిల్లులు చెల్లించాలనుకుంటే, మీరు వీటన్నింటికీ ఈసీఎస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రుణాలు, క్రెడిట్ కార్డుల పేమెంట్స్ ఈసీఎస్‌ ద్వారా చేయవచ్చు. వినియోగదారుడు ఇచ్చిన నిర్ధిష్ట వివరాల ప్రకారం.. పేర్కొన్న రోజున రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వినియోగదారుడి ఎకౌంట్ నుంచి మొత్తాన్ని తీసుకుని, ఆ నగదును లబ్ధిదారుని ఖాతాలో వేస్తుంది. ఈసీఎస్‌ సదుపాయం ద్వారా ఉన్న మరో ప్రయోజనం వినియోగదారుడిని తన సర్వీసులతో సులభం చేస్తుంది. ఆలస్యం కాకుండా మీ చెల్లింపులు సకాలంలో చేయడానికి సహాయపడుతుంది. పేపర్‌ అవసరాన్ని తగ్గిస్తుంది.

ఇప్పుడు ఈ సదుపాయంలో ఉన్న లోపాలను పరిశీలిద్దాం. ఇటీవలి కాలంలో ఈసీఎస్‌లో రిజిస్ట్రేషన్లు, రిజక్ట్ ఎవరేజ్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటివి కొంతమేర సమస్యగానే ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉదాహరణకు దీనికి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH)ను తీసుకువచ్చింది. ఈ విధానం జాతీయ చెల్లింపు వ్యవస్థను రూపొందించడానికి అన్ని ప్రాంతీయ ఈసీఎస్‌ వ్యవస్థలను అనుసంధానిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..