Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Insurance: పెంపుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా..? పూర్తి వివరాలు

పెట్స్ కోసం చేసే ఇన్సూరెన్స్ పాలసీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. పెట్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఫెర్రెట్‌లు, ఇతరదేశాల పక్షులు, సరీసృపాలు, పొట్‌బెల్లీ పందులు అలాగే అన్ని రకాల పెంపుడు జంతువులకు ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. కవరేజ్ ధర సాధారణంగా జంతువు వయస్సు, ఆరోగ్య ప్రొఫైల్ అలాగే మీరు ఎంచుకున్న సంరక్షణ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, వయసు..

Pet Insurance: పెంపుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా..? పూర్తి వివరాలు
Animals Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2023 | 9:24 PM

మీరు ఇంట్లో ఏదైనా జంతువును పెంచుతున్నారా? అంటే.. కుక్క, పిల్లి, కోతి ఇలా ఏదైనా సరే. ఇలా ఇంట్లో పెంచే జంతువులను పెట్స్ అని పిలుచుకుంటాం కదా. మీ ఇంట్లో ఉన్న మీ పెట్‌కు ఇన్సూరెన్స్ చేయించారా? లేదా? అదేమిటి పెట్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా? అని అనుకుంటున్నారా? ఉంది. మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు ఇన్సూరెన్స్ చేయించే అవకాశం ఉంది. వాటికీ ఆరోగ్యం పాడయినా.. గాయాలకు గురైనా.. వాటికి ఇప్పించే ట్రీట్మెంట్ కోసం ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. మనలో చాలామందికి ఈ విషయం తెలీదు. మనకి ఎలాగైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందో..వాటికి కూడా ఉంది. అది ఎలా అయితే మన హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడుతుందో అలానే మన పెట్స్ కి కూడా చేయించే ఇన్సూరెన్స్ వాటి హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ పెట్ ఇన్సూరెన్స్ గురించి వివరంగా చెప్పుకుందాం. అసలు ఈ పెంపుడు జంతువులకు ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎవరు ప్రారంభించారో అనే దగ్గర నుంచి ఈ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఇందులో కవర్ అయ్యే అంశాలు ఏమిటి? ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పెట్ ఇన్సూరెన్స్ పాలసీని 1890లో స్వీడన్‌లో క్లేస్ వర్జిన్ తీసుకువచ్చారు వర్జిన్ – లాన్స్ ఫార్సాక్రింగ్స్ అలయన్స్ వ్యవస్థాపకుడు. ఆ సమయంలో ఆయన గుర్రాలు, పశువులకు ఈ పాలసీలను ఇచ్చే పధ్ధతి తీసుకువచ్చారు. మన దేశంలో బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ 2020 సంవత్సరంలో పెంపుడు కుక్కలకు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకువచ్చింది. ఇది చాలా సక్సెస్ అయింది. కరోనా మహమ్మారి సమయంలో ఇంటిలో జంతువులను పెంచే విధానం బాగా పెరిగింది. దీంతో ఈ ఇన్సూరెన్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది.

పెంపుడు జంతువులకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి?

మన కుటుంబంలోని ఇతర సభ్యుల లానే.. మన పెట్స్ కూడా అనారోగ్యం లేదా గాయాల పాలు అవడం సహజం. అలాగే మన పెట్స్ ఎవరికైనా కలిగించే నష్టానికి మనమే బాధ్యులం అవుతాం. ఇటువంటి పరిస్థితిలో అటువంటి నష్టాలను కవర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. దీనికోసం ఉపయోగపడే అనేక రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి నుంచి మనకు అనుకూలమైన పాలసీని ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పెట్స్ కోసం చేసే ఇన్సూరెన్స్ పాలసీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. పెట్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఫెర్రెట్‌లు, ఇతరదేశాల పక్షులు, సరీసృపాలు, పొట్‌బెల్లీ పందులు అలాగే అన్ని రకాల పెంపుడు జంతువులకు ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. కవరేజ్ ధర సాధారణంగా జంతువు వయస్సు, ఆరోగ్య ప్రొఫైల్ అలాగే మీరు ఎంచుకున్న సంరక్షణ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, వయసు ఎక్కువ ఉన్న జంతువులను కవర్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని కంపెనీలకు వయస్సు పరిమితులు ఉంటాయి. అలాగే ముందుగా ఉన్న పరిస్థితులకు మినహాయింపులు ఉండవచ్చు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వంశపారంపర్య పరిస్థితులు అంటే హిప్ డైస్ప్లాసియా లాంటి వ్యాధులకు గురయ్యే కొన్ని జాతులను కవర్ చేయకపోవచ్చు.

పెట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మూడు స్థాయిలు ఉన్నాయి. వాటిలో బేసిక్ కవరేజ్ తక్కువ ఖరీదైన ఎంపిక. బేసిక్ కవరేజ్ ప్రక్రియల కోసం అత్యల్ప రీయింబర్స్‌మెంట్‌లను అందిస్తుంది. ప్రమాదవశాత్తు గాయాలు, విషాలు- అనారోగ్యాలకు (క్యాన్సర్‌తో సహా) చెల్లించడంలో సహాయపడుతుంది. ఈ పాలసీలు సాధారణంగా ప్రమాదం లేదా అనారోగ్యానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌లపై పరిమితులు, అలాగే పాలసీ వ్యవధికి మొత్తం రీయింబర్స్‌మెంట్‌లపై లిమిటేషన్స్ ను కలిగి ఉంటాయి.

కామ్ప్రహేన్సివ్ కవరేజ్ ప్రాథమిక కవరేజీ కంటే ఖరీదైనది. అయితే ప్రమాదవశాత్తు గాయాలు, అత్యవసర పరిస్థితులు, అనారోగ్యాల కోసం రీయింబర్స్‌మెంట్‌లు, డాక్టర్ చెకప్ ఖర్చుల కోసం కవరేజ్, ప్రిస్క్రిప్షన్‌లు, డయాగ్నస్టిక్ పరీక్షలు, ఎక్స్-రేలు, ల్యాబ్ ఫీజులు వంటి మరింత ఉదారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలసీలు ప్రాథమిక కవరేజీ కంటే తక్కువ వార్షిక తగ్గింపులను కలిగి ఉంటాయి. కానీ ప్రమాదం, అనారోగ్యంతో పాటు పాలసీ వ్యవధికి సంబంధించిన మొత్తం రీయింబర్స్‌మెంట్‌లపై కూడా క్యాప్ రీయింబర్స్‌మెంట్‌లను కలిగి ఉంటాయి. క్యాష్ లిమిట్ కవర్ ఈ పెట్ ఇన్సూరెన్స్ లో ఆసక్తి కరమైన కవర్ అని చెప్పవచ్చు. దీనికి టైం లిమిట్ ఉండదు. అంటే రెన్యువల్ కోసం టైం పిరియడ్ ఉండదు. కానీ, క్యాష్ పరిమితి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ఖర్చుల పరిమితి ఎంత ఉందో ఆ పరిమితి చేరుకునే వరకూ దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇక పెట్ ఇన్సూరెన్స్ ప్రీమియం 200 రూపాయల నుంచి మొదలవుతుంది.10 వేల రూపాయల వరకూ ఉండే పాలసీలు అందుబాటులో ఉంటాయి.

సింపుల్ గా చెప్పాలంటే.. మన పెట్స్ ప్రమాదాల బారిన పడినప్పుడు మెడికల్ ఖర్చుల నుంచి రక్షణ, మన పెట్స్ ను ఎవరైనా దొంగిలించినా, మన పెట్స్ కారణంగా ఇతరులకు ఏదైనా నష్టం కలిగినా, వ్యాక్సినేషన్, వంటి అన్నిరకాల ఇబ్బండులకూ ఈ పాలసీలు రక్షణ కల్పిస్తాయి. అలాగే పాలసీలు ఒక ఏడాది కాలపరిమితితో లభిస్తాయి. 3 నెలల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న పెంపుడు జంతువులకు ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తాయి. అన్నట్టు వీటికి యాడ్ ఆన్ లు కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ కవర్, డెత్, దొంగతనం లేదా నష్టం నుంచి రక్షణను అందించే యాడ్-ఆన్లను తీసుకోవచ్చు.

మన దేశంలో పెంపుడు జంతువులకు ఇన్సూరెన్స్‌ ఇచ్చే కంపెనీలు:

మన దేశంలో పెంపుడు జంతువులకు ఇన్సూరెన్స్‌ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. అవేంటంటే.. 1. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 3. బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి