LIC Policy: జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యిందా? క్లైయిమ్‌ చేయడానికి నియమాలు ఏమిటి!

ఒక నెల ముందుగానే మీకు బీమా కంపెనీ నుంచి ఫారమ్‌ అందుతుంది.మీ జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయి, మీరు బీమా మొత్తాన్ని పొందడానికి క్లెయిమ్ చేయాలనుకుంటే, ముందుగా మీరు అన్ని రికార్డులను మీ వద్ద ఉంచుకోవాలి. పాలసీ మెచ్యూరిటీ తేదీ, హామీ మొత్తం అలాగే హామీ ఇవ్వబడిన బోనస్ వంటివి. అయితే, సాధారణంగా బీమా కంపెనీలు మెచ్యూరిటీ తేదీకి ఒక నెల ముందు డిశ్చార్జ్ ఫారమ్‌ను తమ కస్టమర్‌లకు పంపుతాయి. ఈ ఫారమ్ కాగితపు పనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది..

LIC Policy: జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యిందా? క్లైయిమ్‌ చేయడానికి నియమాలు ఏమిటి!
Lic Policy
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2023 | 4:58 PM

జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు ఆ డబ్బును తీసుకునేందుకు అర్హులవుతారు. బీమా పాలసీ నిబంధనల ప్రకారం మీరు బీమా కంపెనీ నుంచి డబ్బు తీసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. దీని తర్వాత బీమా మొత్తం మీ ఖాతాకు చేరుతుంది. అయితే మెచ్యూరిటీ వ్యవధిని పొందే పద్ధతి చాలా సులభం. మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయడానికి మనం ఏమి చేయాలో, ఏ పత్రాలు అవసరమో తెలుసుకోండి.

ఒక నెల ముందుగానే మీకు బీమా కంపెనీ నుంచి ఫారమ్‌ అందుతుంది.మీ జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయి, మీరు బీమా మొత్తాన్ని పొందడానికి క్లెయిమ్ చేయాలనుకుంటే, ముందుగా మీరు అన్ని రికార్డులను మీ వద్ద ఉంచుకోవాలి. పాలసీ మెచ్యూరిటీ తేదీ, హామీ మొత్తం అలాగే హామీ ఇవ్వబడిన బోనస్ వంటివి. అయితే, సాధారణంగా బీమా కంపెనీలు మెచ్యూరిటీ తేదీకి ఒక నెల ముందు డిశ్చార్జ్ ఫారమ్‌ను తమ కస్టమర్‌లకు పంపుతాయి. ఈ ఫారమ్ కాగితపు పనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది.

మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత క్లెయిమ్ చేయడానికి నియమాలు:

బీమా పాలసీ మెచ్యూరిటీ పూర్తయితే, బీమా చేసిన వ్యక్తి పాలసీ వ్యవధిలో జీవించి ఉంటేనే బీమా కంపెనీలు మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తాయి. అలాగే మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు పాలసీని సరెండర్ చేయకూడదు లేదా రద్దు చేయకూడదు. ఇది కాకుండా పాలసీదారు అన్ని ప్రీమియంలను సకాలంలో చెల్లించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఎప్పుడు క్లెయిమ్ చేయాలి:

మెచ్యూరిటీ తేదీ ముగిసిన వెంటనే పాలసీ మొత్తం మీకు చెల్లించబడిందని నిర్ధారించుకోవడానికి, పాలసీ మెచ్యూరిటీ తేదీకి దాదాపు నెల రోజుల ముందు పాలసీదారుడు అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తును బీమా కంపెనీకి పంపాలి.

సాక్షుల సంతకాలు కూడా:

మీకు కావాలంటే మీరు బీమా కంపెనీ వెబ్‌సైట్ నుంచి పాలసీ డిశ్చార్జ్ ఫారమ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా కంపెనీ కార్యాలయం నుంచి కూడా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఫారమ్‌పై పాలసీదారుతో పాటు ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. ఇది కాకుండా పాలసీ డాక్యుమెంట్‌పై రెవెన్యూ స్టాంప్ కూడా వేయాలి.

ఈ పత్రాలు అవసరం:

మీరు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత పాలసీ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే మీకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, ఐడి ప్రూఫ్ కాపీ (పాన్ కార్డ్-ఆధార్ కార్డ్), అడ్రస్ ప్రూఫ్ కాపీ, బ్యాంక్ వివరాలతో కూడిన బ్యాంక్ మాండేట్ ఫారమ్, రద్దు చేయబడిన చెక్కు కూడా ఇవ్వాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!