గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీగా మార్చుకోవచ్చా?

గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను పర్సనల్ ప్లాన్‌గా మార్చుకోవాలనుకుంటే దీనినే పోర్ట్ అని కూడా అంటారు. మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను పోర్ట్ చేసుకోవాలని అనుకుంటే ముందుగా మీరు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఆ విషయం చెప్పాలి. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అవడానికి 45 రోజుల ముందుగానే ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది. దీనివలన ఈజీగా ఇన్సూరెన్స్ పోర్ట్ వీలవుతుంది..

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీగా మార్చుకోవచ్చా?
Health Insurance Policy
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2023 | 8:08 PM

ఇప్పుడు ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తున్న అందరికీ దాదాపుగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటోంది. కంపెనీ నుంచి తప్పనిసరిగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం వస్తోంది. అయితే కంపెనీ మారినపుడు ఈ ఇన్సూరెన్స్ ఆటోమెటిగ్గా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కి లిమిటేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇలాంటప్పుడు ఎవరైనా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని ఫ్యామిలీ ఫ్లోటర్‌గా లేదా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గా మార్చుకోవచ్చు. ఈ అవకాశం ఉండనే విషయం చాలామందికి తెలీదు. ఇప్పుడు ఇలా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా పర్సనల్ ఇన్సూరెన్స్ గా ఎలా మార్చుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను పర్సనల్ ప్లాన్‌గా మార్చుకోవాలనుకుంటే దీనినే పోర్ట్ అని కూడా అంటారు. మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను పోర్ట్ చేసుకోవాలని అనుకుంటే ముందుగా మీరు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఆ విషయం చెప్పాలి. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అవడానికి 45 రోజుల ముందుగానే ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది. దీనివలన ఈజీగా ఇన్సూరెన్స్ పోర్ట్ వీలవుతుంది.

మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందుగానే మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కంపనీ అందిస్తున్న పర్సనల్ ప్లాన్స్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. మీరు కోరుకునే ఇన్సూరెన్స్ పాలసీ అక్కడ దొరుకుతుందా లేదా అనేది చూసుకోవాలి. మీ అవసరాలకు తగిన పర్సనల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఆ కంపెనీలో అందుబాటులో ఉంటే కనుక మీరు పోర్ట్ కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇలా గ్రూప్ నుంచి పర్సనల్ ఇన్సూరెన్స్‌కి పోర్ట్ అవ్వాలంటే మీ అదే కంపెనీలో మాత్రమే అవుతుంది. మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వేరొక కంపెనీకి ఇన్సూరెన్స్ పోర్ట్ కుదరదు.

ఇవి కూడా చదవండి

మీకు అవసరాలు తీర్చే పాలసీ అందుబాటులో ఉందని నిర్ధారించుకున్న తరువాత మీ వివరాలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. దీని కోసం పోర్టుబిలిటీ అప్లికేషన్, ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రపోజల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకోండి. వాటిని పూర్తి చేయండి. మీకు సంబంధించిన ప్రతి వివరమూ అంటే మీకు ఆల్రెడీ ఉన్న హెల్త్ పాలసీలు, మీ హెల్త్ హిస్టరీ, ఏవైనా క్లెయిమ్స్ చేసుకుని ఉంటే వాటి వివరాలు స్పష్టంగా ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తరువాత మీ ఇన్సూరెన్స్ కంపెనీ వీటిని పరిశీలించి మీ ఇన్సూరెన్స్ పోర్ట్ కు పర్మిషన్ ఇస్తుంది. తరువాత మీరు డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వీటిలో ఏవిధంగానైనా పేమెంట్ చేయవచ్చు.

ఇలా పోర్ట్ చేసుకోవడం వలన మీకు వేయింటింగ్ పిరియడ్ కలిసి వస్తుంది. అప్పటికే అదే కంపెనీతో మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నందు వల్ల పర్సనల్ పాలసీకి వర్తించే వెయిటింగ్ పిరియడ్ ఆమేరకు తగ్గుతుంది. ఉదాహరణకు మీరు రెండేళ్లుగా ఆ కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉన్నారని అనుకుందాం. మీరు పోర్ట్ అవ్వాలనుకుంటున్న పాలసీకి మూడేళ్ళ వెయిటింగ్ పిరియడ్ ఉందని అనుకుందాం. మీరు పోర్ట్ అయినపుడు ఒక్క సంవత్సరం మాత్రమే వెయిటింగ్‌ పీరియడ్ ఉంటుంది.

ఇన్సూరెన్స్ పోర్ట్ చేసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో మాట్లాడి మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్న తరువాత గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి పర్సనల్ ఇన్సూరెన్స్ కు పోర్ట్ అవ్వండి. అవసరం అనుకుంటే ఇన్సూరెన్స్ నిపుణులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి