AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు రాలేదా..? వెంటనే ఇలా చేయండి

పీఎం కిసాన్ లబ్దిదారులకు భారీ శుభవార్త. ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ కానున్నాయి. కోయంబత్తూరులో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు రాలేదా..? వెంటనే ఇలా చేయండి
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2025 | 12:15 PM

Share

PM Kisan 21st installment : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని కోయంబత్తూరులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. దాదాపు 18 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు.దీంతో పీఎం కిసాన్ లబ్దిదారుల అకౌంట్లో నేడు రూ.2 వేలు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు విడుదల కానున్నట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా.. లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు పీఎం కిసాన్ డబ్బులను బటన్ నొక్కి ప్రధాని మోదీ జమ చేయనున్నారు. పీఎం కిసాన్ నిధులు లబ్దిదారుల అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. లేదా మీ సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్స్ లేదా స్టేట్ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇదే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ అప్లికేషన్‌లోకి వెళ్లి కూడా చేసుకోవచ్చు.

డబ్బులు పడ్డాయో.. లేదో చూసుకోండిలా..

-pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి -“Farmer’s Corner” ట్యాబ్‌పై క్లిక్ చేయండి -ఆ తర్వాత “Know Your Status” ఆప్షన్‌ను ఎంచుకోండి -మీ రిజిస్ట్రేషన్ నెంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నిర్ధారించండి. -మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి -ఆ తర్వాత 21వ విడత డబ్బులు మీకు వచ్చాయా.. లేదా అనే స్టేటస్‌ను చెక్ చేయండి

పడకపోతే ఏం చేయాలి..?

ఈకేవైసీ లేదా ఆధార్ కార్డ్, పాన్ కార్డు వెరిఫై చేసుకోకపోతే డబ్బులు పడవు. అలాగే బ్యాంక్ అకౌంట్‌ ప్రాబ్లం వల్ల కూడా నిధులు జమ కావు. ఇలాంటి సమయంలో బ్యాంక్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేయాలి. కేవైసీ పూర్తి చేయగానే కొద్దిరోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి