AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం! వీటిల్లో పెట్టుబడి పెట్టారో అంతే సంగతులు!

పెట్టుబడులు పెట్టే సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎక్కడ పెడితే మినిమం గ్యారంటీ? సురక్షిత, స్థిరమైన పెట్టుబడి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆర్థిక మాంద్యానికి సగటు మనిషి ఎలా సన్నద్ధమవ్వాలి?

Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం! వీటిల్లో పెట్టుబడి పెట్టారో అంతే సంగతులు!
Investments
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 21, 2022 | 12:09 PM

ప్రపంచాన్ని కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. గతంలో ఎన్నడూ లేనంతగా విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. భయపెడుతున్న ఆర్థిక మాంద్యం ఊహాగానాలు.. వెరసి సగటు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత కొరవడింది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. కుటుంబాల్లో ఆర్థిక మందగమనం వెక్కిరిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టే సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎక్కడ పెడితే మినిమం గ్యారంటీ? సురక్షిత, స్థిరమైన పెట్టుబడి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆర్థిక మాంద్యానికి సగటు మనిషి ఎలా సన్నద్ధమవ్వాలి? వంటి అంశాలపై నిపుణులు సలహాలు.. సూచనలు మీకోసం..

కారణమిదే..

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. రాజకీయ అనిశ్చిత పరిస్థితి, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ఆహార, ఇంధన వస్తువుల ధరలను అమాంతం పెరిగిపోయేలా చేశాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు విడతల వారీగా పెంచుకుంటూ పోతోంది. ఇవన్నీ ప్రంపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నడిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పెట్టుబడి దారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక్కడ పెట్టుబడి పెడితే సేఫ్..

స్థిర ఆస్తులకు సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు చాలా సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మార్కెట్ కి డైరెక్ట్ లింక్ కాకపోవడంతో మాంద్యం ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బంగారం, బాండ్స్, ఫిక్స్ డ్ లేదా డెబ్ట్ వంటి వాటిల్లో పెట్టుబడులు అత్యంత సురక్షితం. అలాగే నాన్ మార్కెట్ రంగమైన రియల్ ఎస్టేట్ కూడా లాభదాయకంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఏర్పడిన డిమాండ్ ను బట్టి దీనిలో పెట్టుబడులు పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇలా ఒకే రంగంలో అధిక పెట్టుబడులు పెట్టకుండా.. పలు రంగాల్లో పెట్టడం వల్ల ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాలు కూడా చాలా సురక్షితమని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీటిల్లో పెట్టుబడులు పెట్టకుంటే మేలు..

ఒక వేళ 2023లో ఆర్థిక మాంద్యం వస్తే.. డైరెక్ట్ గా మార్కెట్ తో లింకైన పలు రంగాలు కుదుపునకు గురయ్యే అవకాశాలున్నాయి. వీటిల్లో స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాల్లో పెట్టబుడిదారులు తమ పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో రాబడులు అధికంగా ఉన్నా.. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడులకు ఇవి మంచి ఆప్షన్ కాదని వివరిస్తున్నారు.

ఎలా సిద్ధపడాలి..

ఆర్థిక మాంద్యం ఊహగానాల నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా.. రాబడులు తగ్గినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే లిక్విడ్ క్యాష్ ఉండాలంటున్నారు. అలాగే రిస్క్ తక్కువ ఉండే వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అప్పులను అవకాశం ఉన్నంత వరకూ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..