Pennar Group Orders: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌కు రూ.582 కోట్ల విలువైన ఆర్డర్లు..!

Pennar Group Orders: ప్రముఖ ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీ వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థల నుంచి రూ.582 కోట్ల విలువైన ఆర్డర్లు..

Pennar Group Orders: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌కు రూ.582 కోట్ల విలువైన ఆర్డర్లు..!
Follow us

|

Updated on: Dec 19, 2021 | 4:43 PM

Pennar Group Orders: ప్రముఖ ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీ వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థల నుంచి రూ.582 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. శ్రీదిగ్విజయ్‌ సిమెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మ్యాట్రిక్స్‌ స్ట్రక్చర్‌, లోధా గ్రూపుల నుంచి ప్రీ- ఇంజనీర్‌ బిల్డింగ్‌ కేటగిరికి గోదాముల నిర్మాణం, సౌర పీవీ మాడ్యూళ్లు, స్ట్రక్చర్‌ స్టీల్‌ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి ఈ ఆర్డర్లను సంపాదించుకుంది. అలాగే రైల్వే ఉత్పత్తుల విభాగానికి వాల్‌టెక్‌, డైమమిక్‌, ఆర్బినాక్స్‌, ఐసీఎఫ్‌ ఎన్‌సీఆర్‌ తదితర కంపెనీల నుంచి ఈ ఆర్డర్లు వచ్చాయి.

అలాగే విదేశాల్లో పెన్నార్‌ గ్రూప్‌ యూఎస్‌ అనుబంధ సంస్థలు జేమ్స్‌ హార్డీ, ఆస్పైర్‌ డిజైన్‌, ఇండియన్‌ క్రీక్‌ మూవీ స్టూడియోస్‌ వంటి కస్టమర్ల నుంచి రూ.186 కోట్ల విలువైన ఆర్డర్లను బుక్‌ చేసుకుంది. కంపెనీ క్యూ2 సెప్టెంబర్‌ 2020లో రూ.0.57 కోట్ల నికర లాభంతో పోలిస్తే 2021 సెప్టెంబర్‌ క్యూ2లో రూ.8.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది. సెప్టెంబర్‌ 2020 క్యూ2తో పోలిస్తే సెప్టెంబర్‌ 2021లో నికర అమ్మకాలు 41.3 శాతం పెరిగి రూ.551.70 కోట్లకు చేరాయి.

ఇవి కూడా చదవండి:

e-Shram: రైతులు ఈ స్కీమ్‌లో చేరితే రూ.2 లక్షల బెనిఫిట్‌.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు..!

Electric Cars: ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుపై పన్ను మినహాయింపు.. ఎంత ప్రయోజనం పొందవచ్చంటే..?

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ