Payments Without CVV: సీవీవీ లేకుండానే పేమెంట్స్ షురూ.. కానీ ఆ కార్డుదారులకు మాత్రమేనట..
ఆన్‌లైన్ పేమెంట్స్ కార్డుల ద్వారా చేసేవారు కార్డు నంబర్, కార్డుదారుని పేరు, ఎక్స్‌పైరీ వివరాలతో పాటు సీవీవీ ఎంటర్ చేస్తేనే పేమెంట్ ముందుకు కదులుతుంది. ఒకవేళ సీవీవీ తప్పుగా ఎంటర్ చేస్తే ఓటీపీ ద్వారా ధ్రువీకరించినా పేమెంట్ ఫెయిల్ అవుతుంది. అయితే ప్రస్తుతం రూపే డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు సీవీవీ అవసరం లేకుండానే పేమెంట్ చేసే అవకాశం వస్తుంది.
ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. మెరుగైన టెక్నాలజీ కారణంగా చాలా రకాల సేవలకు, ఆన్‌లైన్ కొనుగోళ్లకు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. బ్యాంకులు కూడా నూతన టెక్నాలజీ అప్‌డేట్ కావడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ మరింత సులువుగా మారాయి. అలాగే ప్రతి ఎకౌంట్ హోల్డర్‌కు డెబిట్ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. అయితే ఆన్‌లైన్ పేమెంట్స్ కార్డుల ద్వారా చేసేవారు కార్డు నంబర్, కార్డుదారుని పేరు, ఎక్స్‌పైరీ వివరాలతో పాటు సీవీవీ ఎంటర్ చేస్తేనే పేమెంట్ ముందుకు కదులుతుంది. ఒకవేళ సీవీవీ తప్పుగా ఎంటర్ చేస్తే ఓటీపీ ద్వారా ధ్రువీకరించినా పేమెంట్ ఫెయిల్ అవుతుంది. అయితే ప్రస్తుతం రూపే డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు సీవీవీ అవసరం లేకుండానే పేమెంట్ చేసే అవకాశం వస్తుంది. అయితే ఈ అవకాశం కేవలం టోకనైజ్డ్ కార్డులకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. రూపే తన కార్డ్ హోల్డర్లందరికీ మెరుగైన భద్రతను అందించడానికి దేశీయ ఈ-కామర్స్ లావాదేవీల కోసం ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, 2021లో ఫైల్ టోకనైజేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి రూపే ఇప్పుడు సీవీవీ లేకుండా చెల్లింపులు చేసే విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ టోకనైజేషన్ పేమెంట్ అనేది వ్యాపారులతో స్పష్టమైన లేదా నిజమైన కార్డ్ వివరాలను పంచుకోకుండా కార్డ్ లావాదేవీలను చేయడానికి సులభమైన సాంకేతికతగా అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన ఈ చెల్లింపు విధానాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
దేశీయ ఈ-కామర్స్ లావాదేవీ కోసం కార్డ్ హోల్డర్ తమ కార్డ్‌ను సేవ్ చేయడాన్ని ఎంచుకున్నప్పుడు వారు ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఒక-పర్యాయ కార్యకలాపంగా కార్డ్ వివరాల (కార్డ్ నంబర్, సీవీవీ, కార్డ్ గడువు తేదీ) ద్వారా లావాదేవీని ప్రమాణీకరిస్తారని ఎన్‌పీసీఐ తెలిపింది. రెండు-కారకాల ప్రమాణీకరణ). వివరాలు టోకనైజ్ చేసి, వ్యాపారి వద్ద సేవ్ అవుతాయి. వ్యాపారి వద్ద నిజమైన వివరాలు సేవ్ కావు కాబట్టి ఇది సైబర్ మోసాలను అరికట్టడంలో సాయం చేస్తుంది. ముఖ్యంగా మళ్లీ అదే వ్యాపారికి పేమెంట్ చేయాల్సి వస్తే అప్పుడు కూడా ఓటీపీ ప్రామాణికతతో చెల్లింపును పూర్తి చేయవచ్చు. కస్టమర్ల పరికరాలలో ఆటో-రీడ్ ఓటీపీ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఈ చెల్లింపు అనుభవం గతంలో కంటే సున్నితంగా మారుతుంది. ర్యాపిడో, పోర్టర్ వంటి వ్యాపారుల కోసం రేజర్‌పేతో పాటుగా కొత్త సీవీవీ చెల్లింపు ఆప్షన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ ఫీచర్‌ను విస్తరింపజేయడానికి రూపే ప్రధాన గేట్‌వేలైన పేయూ, సైబర్ సోర్స్, ఫస్ట్ డేటా, పేటీఎం వంటి సంస్థలతో కూడా పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు మద్దతిచ్చే ఈ-కామర్స్ మర్చంట్‌లో తమ కార్డ్‌ను సేవ్ చేస్తే(టోకనైజ్) కార్డ్ హోల్డర్ వారి వాలెట్‌ను చేరుకోవాల్సిన అవసరం లేదని అలాగే కార్డు వివరాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి