Honda Elevate: త్వరలో హోండా నుంచి మిడ్ సైజ్ ఎలివేట్.. ఆ రెండు కార్లకు పోటినిస్తూ టీజర్ లాంచ్.. రిలీజ్ ఎప్పుడేంటే?

తాజాగా జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం హోండా, ఎట్టకేలకు మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్‌ను ఆవిష్కరించింది. ఈ కార్‌ను జూన్ 6న విడుదల చేస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో టీజర్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ కార్ ఓవర్ హెడ్ యాంగిల్ నుంచి ఎలివేట్ టీజర్‌ను విడుదల చేసింది. ఎలివేట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో వస్తుందని, ముఖ్యంగా ఈ కార్ ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు ప్రధాన పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Honda Elevate: త్వరలో హోండా నుంచి మిడ్ సైజ్ ఎలివేట్.. ఆ రెండు కార్లకు పోటినిస్తూ టీజర్ లాంచ్.. రిలీజ్ ఎప్పుడేంటే?
Honda Elevate
Follow us
Srinu

|

Updated on: May 17, 2023 | 4:30 PM

కార్ అంటే మిడిల్ క్లాస్ ప్రజలకు ఓ ఎమోషన్. ముఖ్యంగా ఇంటిళ్లపాది ఎక్కడికైనా వెళ్లేందుకు ఓ మంచి కార్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. భారతదేశంలో కూడా మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువ. దీంతో మధ్యతరగతి మార్కెట్‌లో తమ హవా చూపించేందుకు వివిధ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం హోండా, ఎట్టకేలకు మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్‌ను ఆవిష్కరించింది. ఈ కార్‌ను జూన్ 6న విడుదల చేస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో టీజర్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ కార్ ఓవర్ హెడ్ యాంగిల్ నుంచి ఎలివేట్ టీజర్‌ను విడుదల చేసింది. ఎలివేట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో వస్తుందని, ముఖ్యంగా ఈ కార్ ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు ప్రధాన పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కార్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

హోండా ఎలివేట్ రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ కార్ ఫీచర్ల గురించి చూస్తే హోండా ఎలివేట్ రెండు అద్భుతమైన బాడీ లైన్‌లతో కూడిన ఫ్లాట్ బానెట్‌ను కలిగి ఉంది. ఈ కార్ సొగసైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎక్కువగా ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉంది. ఈ కార్ వెనుక భాగం కొద్దిగా నిటారుగా ఉంటుంది. అలాగే  సొగసైన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఈ కార్ పైన షార్క్ ఫిన్ యాంటెనాతో సిల్వర్ రూఫ్ రెయిల్‌ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కార్‌లో సింగిల్ పేన్ గ్లాస్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ వస్తుంది. ప్రస్తుతం, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరిడర్ వంటి కార్లల్లో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌లు ఉంటున్నాయి. వీటికి భిన్నంగా ఈ కార్‌లో పేన్ గ్లాస్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ కార్ హోండా క్లాసీ డిజైన్‌తో సూపర్ ఫినిషింగ్‌తో వస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఇతర సేఫ్టీ ఫీచర్‌లు వంటి ఫీచర్లతో ఈ కారు రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

హోండా ఎలివేట్ 121పీఎస్, 150 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్‌లో కూడా ఉంటుంది. ఎస్‌యూవీ ఫారమ్ ఫ్యాక్టర్‌కు సరిపోయేలా పవర్ లక్షణాలను హోండా సర్దుబాటు చేయగలదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కార్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో హోండా సిటీ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ ఏబీడీతో తో కూడిన ఏబీఎస్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్‌వ్యూ కెమెరా, హోండాకు మాత్రమే చెందిన లేన్‌వాచ్ టెక్నాలజీతో సహా అనేక భద్రతా లక్షణాలతో కూడా వస్తుంది. హోండా కార్స్ ఇండియా భారతదేశంలో డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని నిలిపివేసినందున, ఈ ఎస్‌యూవీకి డీజిల్ మోటార్ అందుబాటులో ఉండదు. అలాగే ఈ కార్ రూ. 12 నుంచి రూ.19 లక్షల రేంజ్‌లో విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి