AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: వినియోగదారులకు అలర్ట్‌.. నిరూపయోగంగా మారనున్న 13 కోట్ల పాన్‌ కార్డులు.. ఎందుకు..?

మన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌కార్డు తప్పనిసరి. పాన్‌ బ్యాంకు ఖాతా తీయడం నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు తప్పకుండా కావాల్సిందే..

PAN Card: వినియోగదారులకు అలర్ట్‌.. నిరూపయోగంగా మారనున్న 13 కోట్ల పాన్‌ కార్డులు.. ఎందుకు..?
Pan Card
Subhash Goud
|

Updated on: Feb 11, 2023 | 8:43 AM

Share

మన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌కార్డు తప్పనిసరి. పాన్‌ బ్యాంకు ఖాతా తీయడం నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు తప్పకుండా కావాల్సిందే. ఆధార్‌ కార్డులాగానే పాన్‌ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. దీనిని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేస్తుంది. అయితే పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని ఇప్పటికే కేంద్రంతో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా పదేపదే చెబుతూ వస్తోంది. ఇప్పుడు పాన్‌కార్డు ఉన్నవారికి ఇది కీలక అప్‌డేట్‌. నిర్లక్ష్యం చేస్తే మీ పాన్‌కార్డు శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కోట్లాది పాన్ కార్డులు నిరుపయోగం కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్‌పర్సన్ నితిన్ గుప్తా మీడియా సమావేశంలో ఈ సమాచారం అందించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల పాన్ కార్డుల్లో ఇప్పటి వరకూ 48 కోట్లమందే మాత్రమే తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇంకా 13 కోట్లమంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంది. మార్చి 31, 2023లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విధించిన గడువు ముగిసినందున పెనాల్టీ ఛార్జీలతో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీరు బ్యాంకు లావాదేవీలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించలేరు. ఇప్పటి వరకు పాన్‌కార్డు ఉన్నవారు ఆధార్‌ కార్డుతో అనుసంధానించకపోతే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 31 తేదీలోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ పాన్‌ కార్డు నిరూపయోగంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు మార్చి 31లోగా రూ.1000 పెనాల్టీ చెల్లించి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం