AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funds Management: అవగాహనతోనే అవస్థలు దూరం.. ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఆ జాగ్రత్తలు మస్ట్

ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. స్థిర ఆదాయాలు ఇచ్చే పథకాలు కాకుండా పెట్టుబడి రిస్క్ అయినా పర్లేదు మంచి రాబడి కావాలని వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా వివిధ ఫండ్స్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నాయి. అయితే ఈ ఫండ్స్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

Funds Management: అవగాహనతోనే అవస్థలు దూరం.. ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఆ జాగ్రత్తలు మస్ట్
Funds
Nikhil
|

Updated on: Jun 04, 2025 | 4:12 PM

Share

యాక్టివ్, పాసివ్ ఫండ్ల మధ్య ఎంపిక అనే రిస్క్ టాలరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ​​మార్కెట్‌పై మీ అవగాహనతో పాటు ఆర్థికంగా ఎంత అస్థిరతను తట్టుకోగలరు వంటి వివిధ అంశాలపై ఫండ్స్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.  అయితే ప్రస్తుత అస్థిర మార్కెట్‌లో యాక్టివ్ ఫండ్ నిర్వహణ మెరుగ్గా పనిచేస్తుంది. నేటి మార్కెట్లు ఎల్లప్పుడూ ఫండమెంటల్స్ ద్వారా మాత్రమే ఉండవు. ప్రపంచ వార్తలు, సెంటిమెంట్ మార్పులు, లిక్విడిటీ ఒత్తిళ్లు, సాంకేతిక స్థాయిలపై ఆధారపడి ఉంటాయి. ఈ నిరంతరం మార్పులు అవకాశాలను కూడా ఇస్తాయి. వీటిని తరచుగా మొమెంటం ఇన్వెస్టింగ్ అని పిలుస్తారు. 

యాక్టివ్ ఫండ్ అంటే స్థిరమైన ట్రేడింగ్ కాదు. అంటే అవసరమైనప్పుడు చర్య తీసుకునే వెసులుబాటు కలిగి ఉండడంతో పాటు కరెక్షన్ కు ముందు లాభాలను బుక్ చేసుకోవడం లేదా ఊపందుకుంటున్న రంగాల్లో ఈజీగా ప్రవేశించవచ్చు. అస్థిరత తరచుగా తాత్కాలిక తప్పుడు ధరలను సృష్టిస్తుంది. వీటిని మార్కెట్ అనుభవం, సాంకేతిక స్థాయిలు, రిస్క్ అవగాహన మేరకు మనం తీసుకునే నిర్ణయాలపై రాబడి ఆధారపడి ఉంటుంది. మార్కెట్ తీరును బట్టి నిర్దిష్ట అంశాల మేరకు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను ఉంచడంలో కొనుగోలు, అమ్మకం రెండూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు అధిక పనితీరు ఉన్న రంగాలకు కేటాయింపులను పెంచితే మంచి లాభాలను పొందవచ్చు. అలాగే కొన్నిసార్లు స్వల్పకాలిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్న వాటిల్లో పెట్టుబడి పెట్టినా లాభాలకు ఢోకా ఉండదు. ఈటీఎఫ్‌లు లేదా ఇండెక్స్ ఫండ్ల వంటి పాసివ్ ఫండ్లు, మార్కెట్లను చురుగ్గా అనుసరించని, తక్కువ ఖర్చు, రిస్క్ తిరోగమనం, దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. 

భారతదేశంలోని మూలధన మార్కెట్ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. అలాగే ఈ మార్పుల ప్రయోజనాన్ని పొందడానికి యాక్టివ్ ఫండ్ మేనేజ్‌మెంట్ మీకు వెసులుబాటును ఇస్తుంది. రిటైల్ పెట్టుబడిదారులకు, సమతుల్య పోర్ట్‌ఫోలియో అత్యంత వివేకవంతమైన వ్యూహంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలిక, తక్కువ రిస్క్ సంపద సృష్టి కోసం మూలధనంలో కొంత భాగాన్ని నిష్క్రియాత్మక నిధులకు కేటాయించడం ద్వారా సమతుల్యతను కొనసాగించవచ్చని పేర్కొంటున్నారు. మిగిలిన వాటిని అధిక రిస్క్, మెరుగైన రాబడికి అవకాశం ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టాలని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి