AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్‌పై కీలక అప్‌డేట్.. 20వ వాయిదా జమ ఎప్పుడంటే..?

భారతదేశంలో వ్యవసాయం జీవన ఆధారంగా వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు పెట్టుబడి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పథకంలో సొమ్ము జమ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.

PM Kisan: పీఎం కిసాన్‌పై కీలక అప్‌డేట్.. 20వ వాయిదా జమ ఎప్పుడంటే..?
Pm Kisan
Nikhil
|

Updated on: Jun 04, 2025 | 4:30 PM

Share

దేశంలోని రైతులకు ఆదాయ మద్దతు అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, సాగుదారుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి కేంద్రం తీసుకున్న కీలక చర్యల్లో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని మూడు సమాన వాయిదాలలో రూ. 2,000 చొప్పున అందిస్తుంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఇప్పటివరకు నాలుగు నెలల వ్యవధిలో 19 వాయిదాలు విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 2025లో 19వ విడతను పంపిణీ చేశారు, దీని వలన 2.4 కోట్ల మంది మహిళలు సహా 9.8 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. అంతకుముందు, 18వ భాగం అక్టోబర్ 2024లో మరియు 17వ భాగం జూన్ 2024లో విడుదలైంది.

2019లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన తర్వాత ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా మారింది. అర్హత కలిగిన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం ఏటా రూ. 6,000 చొప్పున ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అందిస్తారు. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

అయితే పీఎం కిసాన్ చివరి (19వ) విడత ఫిబ్రవరి 2025లో జారీ చేసినందున 20వ విడత జూన్ 2025లో జారీ చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని విడుదల చేస్తారని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన కచ్చితమైన తేదీను అధికారికంగా ప్రకటించలేదు. పీఎం కిసాన్ సొమ్మును జూన్ 24న  రిలీజ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  రైతులు తమ ఈ-కేవైసీను పూర్తి చేసి వారి అర్హతను తనిఖీ చేసి, వారి స్టేటస్‌ను ధ్రువీకరించుకోవాలని పేర్కొంటున్నారు. అయితే అర్హులెవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్