AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 నోటు రద్దు..? బ్యాంకులకు RBI ఆదేశాలు జారీ చేసిందా? అసలు విషయం ఇదే..

రూ.500 నోటు రద్దుకు సంబంధించిన వదంతులు సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతున్నాయి. ఆర్బీఐ ఏ బ్యాంకుకు కూడా రూ.500 నోటును రద్దు చేయమని ఆదేశించలేదు. 2025 సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల పంపిణీని పెంచడమే ఆర్బీఐ లక్ష్యం. రూ.500 నోటు రద్దు చేయడం లేదు.

రూ.500 నోటు రద్దు..? బ్యాంకులకు RBI ఆదేశాలు జారీ చేసిందా? అసలు విషయం ఇదే..
500 Note
SN Pasha
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 04, 2025 | 2:48 PM

Share

నోట్ల రద్దు అంటేనే ప్రజల్లో ఒక భయం పుడుతుంది. తాజాగా రూ.500 నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చిందని, బ్యాంకుల తర్వాత రూ.500 నోట్ల సరఫరా తగ్గించాలని, ఏటీఎంలలో కూడా రూ.500 తగ్గిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అసలు రూ.500 నోటు కనిపించకుండా చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా అంటే.. కాదు. ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఆర్బీఐ ఏ బ్యాంకుకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

“సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకులు ఏటీఎంల నుండి రూ.500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI కోరింది. మార్చి 31 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంలలో 75 శాతం, తరువాత 90 శాతం ఏటీఎంలలో తగ్గించడమే లక్ష్యం. ఇకపై ఏటీఎంలలో రూ.200, రూ.100 నోట్లను మాత్రమే పంపిణీ అవుతాయి” అనే విషయం బాగా సర్క్యూలేట్‌ అవుతోంది. నిజానికి ఆర్బీబీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

ఆర్బీఐ బ్యాంకులకు ఏటీఎంల ద్వారా రూ.500 నోట్లను పంపిణీ చేయడాన్ని సెప్టెంబర్ 30, 2025 నాటికి నిలిపివేయాలని ఆదేశించలేదు. బదులుగా అన్ని ఏటీఎంలలో 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం, 2026 మార్చి 31 నాటికి 90 శాతం రూ.100 లేదా రూ.200 నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. అంతేకానీ, రూ.500 నోట్ల రద్దు ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి