AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Currency: ఆ దేశాల కంటే దారుణంగా పాకిస్థాన్ ఆర్థిక స్థితి.. పొరుగు దేశాలకు ఆమడంత దూరం

పాకిస్థాన్, భారత్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇరుదేశాలు యుద్ధానికి దిగుతాయంటూ రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్థాన్ మాటలు యుద్ధ విషయంలో కోటలు దాటుతున్నాయి. కానీ ఆ దేశ ఆర్థిక స్థితి చూస్తే పొరుగు దేశాలన్నింటి కంటే దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రూపాయి కంటే మెరుగ్గా ఉన్న చిన్న దేశాల గురించి తెలుసుకుందాం.

Pakistan Currency: ఆ దేశాల కంటే దారుణంగా పాకిస్థాన్ ఆర్థిక స్థితి.. పొరుగు దేశాలకు ఆమడంత దూరం
Pakistan Currency
Nikhil
|

Updated on: May 01, 2025 | 4:51 PM

Share

డాలర్‌తో పోలిస్తే భారతదేశ రూపాయి మారకం విలువ చారిత్రాత్మకంగా పడిపోతూ ఇప్పుడు 2025లో రికార్డు స్థాయిలో బలపడుతోంది. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ కరెన్సీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజే కాదు. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ రూపాయి గణనీయంగా బలహీనపడింది. ముఖ్యంగా పాకిస్తాన్ కరెన్సీ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల కరెన్సీల కంటే పడిపోయింది. ఏప్రిల్ 2025 తాజా డేటా ప్రకారం యూఎస్ డాలర్‌తో పాకిస్థాన్ కరెన్సీ 280 రూపాయలుగా ఉంది. అదే నేపాలీస్ రూపాయలు అయితే 132, ఆఫ్ఘనిస్థాన్ అయితే 87, భూటాన్ కరెన్సీ విలువ 83, బంగ్లాదేశ్ 117 టాకాలతో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉంది. 

1 నేపాలీ రూపాయి అంటే దాదాపు 2.12 పాకిస్తానీ రూపాయలకు సమానం. 1 ఆఫ్ఘని అంటే దాదాపు 3.21 పాకిస్తానీ రూపాయలు. 1 భూటానీస్ లెంట్రమ్ దాదాపు 3.37 పాకిస్తానీ రూపాయలు. 1 బంగ్లాదేశ్ టాకా అంటే దాదాపు 2.39 పాకిస్తానీ రూపాయలు. కాబట్టి మారకం రేటు పరంగా చూస్తే ఈ నాలుగు దేశాల కరెన్సీల కంటే పాకిస్తాన్ రూపాయి బలహీనంగా మారింది.

పాకిస్తాన్ రూపాయి పతనానికి కారణాలు ఇవే

  • పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు తరచుగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక విధానాలు సరిగ్గా నిర్వహించడం లేదు. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించింది.
  • పాకిస్తాన్ విదేశీ కరెన్సీ (డాలర్ల వంటివి) తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. పదే పదే ఐఎంఎఫ్ నుంచి సహాయం కోరాల్సి వస్తుంది
  • పాకిస్థాన్ దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించింది. అలాగే కరెన్సీపై కూడా ఒత్తిడిని పెంచింది.
  • పాకిస్తాన్ దేశంలోకి దిగుమతులు భారీగా ఉంటాయి. కానీ ఎగుమతులు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా విదేశీ కరెన్సీకి డిమాండ్ అలాగే ఉంటుంది. అందువల్ల పాకిస్థానీ రూపాయి ఒత్తిడికి గురవుతుంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..