AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House planning: సొంత ఫ్లాట్ లేదా అద్దె ఇల్లు.. ఈ రెండింటిలో ఏది బెటరంటే..?

ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ వలస జీవితం తప్పనిసరిగా మారింది. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం సొంత ఊరి నుంచి వేరేచోటకు వెళ్లడం అత్యవసరమైంది. ఇలా వెళ్లిన వారందరూ ముందుగా ఆలోచించేంది ఇంటి కోసమే. చాాాలా మంది సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావిస్తారు. ప్రతి నెలా ఇంటి అద్దె కట్టే బదులు, దానికి కొంత మొత్తం జమ చేసి ఈఎంఐలు చెల్లించడం మంచిదనుకుంటారు. అయితే నేటి కాలంలో అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం మంచిదా, లేకపోతే అద్దె ఇంట్లో ఉండడం ఉత్తమమా అనే విషయాలను తెలుసుకుందాం.

House planning: సొంత ఫ్లాట్ లేదా అద్దె ఇల్లు.. ఈ రెండింటిలో ఏది బెటరంటే..?
Rented House
Nikhil
|

Updated on: Feb 21, 2025 | 4:15 PM

Share

ఫ్లాట్ కొనుగోలు చేయాలా, అద్దె ఇంట్లో ఉండడం మంచిదా అనే విషయం వారి ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సంపాదించే ఆదాయం, ఖర్చుల తదితర వాటిని లెక్కించుకుని నిర్ణయం తీసుకోవాలి. రాజేష్ మాల్యా అనే వ్యక్తి బెంగళూరు నుంచి ముంబైకి మకాం మార్చాడు. అక్కడ ఫ్లాట్ కు నెలకు రూ.35 వేలు అద్దె చెల్లించాలి. ముంబైలోనే స్థిరపడాలని మాల్యా నిర్ణయించుకోవడంతో వెంటనే రూ.60 లక్షల హౌసింగ్ రుణం తీసుకుని ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రతి నెలా ఈఎంఐగా రూ.60 వేలు చెల్లిస్తున్నాడు. వడోదరకు చెందిన రిషి ఆర్య దాదాపు పదేళ్లుగా అద్దె ఇంటిలోనే నివసిస్తున్నాడు. ప్రతి నెలా రూ.18 వేలు ఇంటి అద్దె చెల్లిస్తున్నాడు. హౌసింగ్ రుణం తీసుకుని ఫ్లాట్ కొనుగోలు చేస్తే నెలకు సుమారు రూ.40 వేలు ఈఎంఐ కట్టాలి. దాని కంటే అద్దె ఇంట్లో ఉండడం మంచిదని ఆయన అభిప్రాయం.

నాసిక్ కు చెందిన సమీషాకు సొంత ఇల్లు ఉంది. దాన్ని అతడు రూ.55 లక్షలకు కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో 2022లో ఆ ఇంటిని రూ.1.25 కోట్లకు విక్రయించాడు. అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ లో రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతడు మరో ఐదేళ్ల వరకూ ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకోవడం లేదు. నెలకు రూ.12 వేలు చెల్లించి, అద్దె ఇంట్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే రూ.40 వేలు ఈఎంఐ కట్టేకంటే, రూ.12 వేలు అద్దె చెల్లించడం మంచిదని ఆయన అభిప్రాయం.

ఏది మంచిదంటే..?

ఇవి కూడా చదవండి
  • సొంత ఫ్లాట్ లేదా అద్దె ఇల్లులో ఏది మంచిదనే విషయాన్ని తెలుసుకోవడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో ఇంటి అద్దెలు ఏటా పెరుగుతున్నాయి. అదే సమయంలో హౌసింగ్ ఈఎంఐలు కూడా ఆర్బీఐ రెపోరేటు కారణంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
  • మన దేశంలో అద్దె పెరుగుదల ఆస్తి మార్కెట్ రేటులో 2.5 నుంచి 4.5 శాతం ఉంటుంది. అదే సమయంలో బ్యాంకు వడ్డీ ఏడాదికి 8.10 నుంచి ప్రారంభమవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే ఈ రేటుకు వడ్డీ లభిస్తుంది.
  • స్థిరంగా అదే నగరంలో ఉండాలనుకునేటప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేయడం ఉత్తమం. కానీ మెరుగైన అవకాశం వస్తే వేరే ఊరికి వెళ్లిపోవాలనుకునే వారు అద్దె ఇంట్లో ఉండడం మంచిది.
  • వేగంగా ప్రగతి సాధిస్తున్న నగరాల్లో ఫ్లాట్ ను కొనుగోలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీర్ఘకాలంలో దాని ధర పెరిగే అవకాశం ఉంది.
  • ఇల్లు లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేయాలనుకుంటే ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించాలి. దాదాపు 20 నుంచి 25 ఏళ్ల కాలవ్యవధి ఉంటుంది. వడ్డీ తో కలిసి భారీగా చెల్లించాలి. అయితే ధీర్ఘకాలంలో ఫ్లాట్ ధర పెరుగుతుంది. మీరు కట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుంది.
  •  ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఈఎంఐగా ప్రతి నెలా రూ.40 వేలు చెల్లించాలి. అద్దె ఇంటికి రూ.18 వేలు కడితే సరిపోతుంది. మిగిలిన రూ.22 వేలను సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్థకాలంలో వాటి నుంచి అధిక రాబడి వస్తుంది. దాదాపు 20 ఏళ్లకు వదిలేస్తే.. రెండు ఇళ్లు కొనుగోలు చేసే రాబడి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి