Online Exchange: ఆన్‌లైన్‌లో మీ పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ఇవి గుర్తించుకోండి!

ఈనెల చివరిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ సేల్‌ అందుబాటులోకి రానుంది. మొబైల్‌, ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో, మీరు ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్ లేదా కారు వంటి వాటిని కూడా మార్చుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మంచి డీల్ లాగా అనిపించినప్పటికీ, మీ దగ్గర ఉన్న..

Online Exchange: ఆన్‌లైన్‌లో మీ పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ఇవి గుర్తించుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2024 | 2:40 PM

ఈనెల చివరిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ సేల్‌ అందుబాటులోకి రానుంది. మొబైల్‌, ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో, మీరు ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్ లేదా కారు వంటి వాటిని కూడా మార్చుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మంచి డీల్ లాగా అనిపించినప్పటికీ, మీ దగ్గర ఉన్న పాత ప్రోడక్ట్ సరైన స్థితిలో ఉన్నప్పుడే మీరు ఎక్స్‌ఛేంజ్‌లో ఆఫర్ చేస్తున్న వస్తువులు మీకు సరైన ధరను పొందుతాయని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీ ఫోన్ తీసుకోండి. మీరు Flipkart లేదా Amazonలో మీ ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్‌ చేసినప్పుడు మీరు ఫోన్‌కి ఎక్కువ ధరను పొందలేరు. డెలివరీ సిబ్బంది మీ ఫోన్‌లో ఏదైనా లోపాన్ని కనుగొని దానిని తిరస్కరించే అవకాశం కూడా 90 శాతం వరకు ఉంటుంది.

మంచి ధరకు..

ప్రోడక్ట్ చాలా పాతది కాకపోతే మాత్రమే మీరు ఎక్స్చేంజ్ లో ప్రోడక్ట్ కి మంచి ధరను పొందే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉపయోగించిన వస్తువును మార్పిడి చేసుకుంటే మంచి ధరను పొందవచ్చు. ఒక వేళ రెండేళ్లకుపైగా ఉన్న వస్తువులు ఈ-కామర్స్‌ కంపెనీలు తీసుకోవచ్చు. లేదా తీసుకోకపోవచ్చు. ఒక వేళ తీసుకున్నా ధర మాత్రం మరి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్- అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో మీరు ఒకటిన్నర సంవత్సరాల కిందటి 24 అంగుళాల ఎల్‌ఈడీ టీవీకి కేవలం రూ. 300-350 మాత్రమే పొందుతారు. 43 అంగుళాల ఎల్‌ఈడీ టీవీకి మీరు ఎక్స్చేంజ్ లో కేవలం రూ. 600-650 మాత్రమే పొందుతారు. ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్‌లను ఎక్స్చేంజ్‌లో పెట్టినట్లయితే మరి తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది.

మార్పిడికి ముందు, మీకు కొత్త ప్రోడక్ట్ ఎందుకు కావాలో ఆలోచించండి? మీ ప్రోడక్ట్ దీని జీవితకాలం ముగింపు దశకు చేరుకుందా లేదా మీకు తాజా మోడల్ కావాలా? ఇది కాకుండా చాలా మంది వ్యక్తులు తమ స్నేహితులు, పరిచయస్తుల వద్ద సరికొత్త మోడల్ ఫోన్, కారు, టీవీ ఉన్నందున తమ వద్ద కూడా ప్రోడక్ట్స్ మార్పిడి చేసుకుంటారు.

దీనికి సంబంధించి, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. ఈ-కామర్స్ సైట్‌ల పని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ల పేరుతో ప్రజలను ఆకర్షించడమే. దీంతో వాటి విక్రయాలు పెరుగుతాయి అని చెప్పారు. ఇప్పుడు వస్తువులను మార్చుకోవాలా వద్దా అనేది కస్టమర్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు సరైన ధరను పొందుతున్నట్లు భావిస్తే, దాన్ని మార్చుకోండి. లేకపోతే ఇతర ఎంపికల కోసం వెతకండి.. అయితే ఆన్‌లైన్ -ఆఫ్‌లైన్ ఎక్స్‌ఛేంజ్‌లలో అందుబాటులో ఉన్న ధరలను ఎప్పుడూ సరిపోల్చండి. మీరు ఉత్తమమైన డీల్‌లను పొందే చోటికి వెళ్లండి అని బల్వంత్ జైన్ సూచించారు. .

వస్తువులను ఎక్స్‌ఛేంజ్‌లో ఇచ్చే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు:

ప్రతి వస్తువు విలువ తక్కువగా ఉంటుంది. కానీ ఇ-కామర్స్ సైట్‌లో విలువ చాలా తక్కువగా కనిపించవచ్చు. అలాంటి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మీ పాత వస్తువును మార్పిడిలో విక్రయించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పినట్లు.. ఎల్లప్పుడూ రెడ్ అలర్ట్‌లో ఉండండి. తెలివిగా షాపింగ్‌ చేయడం ఉత్తమం. వద్ద ఫోన్‌ మంచిగానే ఉన్నా.. ఎక్స్‌ఛేంజ్‌లో అతి తక్కువ ధరకే పోయే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?