AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus watch: వన్‌ప్లస్ స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. 21న ఆఫర్లతో మార్కెట్‌లోకి రిలీజ్‌.. ధర ఎంతంటే..?

OnePlus Smart watch: స్మార్ట్ వాచ్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది.. యాపిల్ వాచ్‌. ఆ తర్వాత ఎంఐ, పలు కంపెనీల వాచ్‌లు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆయా కంపెనీల వాచీలకు

OnePlus watch: వన్‌ప్లస్ స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. 21న ఆఫర్లతో మార్కెట్‌లోకి రిలీజ్‌.. ధర ఎంతంటే..?
Oneplus Watch
Shaik Madar Saheb
|

Updated on: Apr 14, 2021 | 9:18 AM

Share

OnePlus Smart watch: స్మార్ట్ వాచ్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది.. యాపిల్ వాచ్‌. ఆ తర్వాత ఎంఐ, పలు కంపెనీల వాచ్‌లు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆయా కంపెనీల వాచీలకు ధీటుగా ఇప్పుడు వన్ప్లస్ స్మార్ట్ వాచ్‌లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. వన్‌ప్లస్ సంస్థ నుంచి వచ్చే మొదటి స్మార్ట్ వాచ్ ఏప్రిల్‌ 21న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ మేరకు వన్‌ప్లస్‌ కంపెనీ ధరను కూడా ప్రకటించింది. ఈ వాచ్‌ ధరను భారతదేశంలో 14,999 గా నిర్ణయించారు. అయితే చైనీస్‌ టెక్నాలజీతో తయారుచేసిన ఈ వాచ్‌ ప్రారంభ ధర రూ. 16,999 గా పేర్కొన్నప్పటికీ.. తాజాగా నిర్ణయించిన ధర ప్రకారం 15వేలకే లభించనుంది. గత నెలలో చైనా టెక్నాలజీతో రూపొందించిన ఈ వాచ్‌ను గత నెలలో ఆవిష్కరించగా.. ఏప్రిల్‌ 21 నుంచి భారత్‌లో అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు పలు కంపెనీల ఆఫర్లు కూడా వర్తించనున్నాయి.

మొదట ప్రముఖులు, రెడ్‌ కేబుల్ క్లబ్ సభ్యులకు వన్‌ప్లస్ వాచ్‌ను అందించనున్నారు. ఏప్రిల్ 21న వన్‌ప్లస్‌ సోర్‌ యాప్‌లల్లో రిటైల్ వ్యాపారం ప్రారంభం కాగానే.. వాచీ రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ సభ్యులకు లభిస్తుంది.. అయితే వినియోగదారులకు వన్‌ప్లస్ వాచ్ ఏప్రిల్ 22 మధ్యాహ్నం నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లల్లో అందుబాటులో లభించనుంది. వన్‌ప్లస్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉండనుంది. బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్లల్లో లభించనుంది. అయితే కొనుగోలుదారులు వన్‌ప్లస్ వాచ్‌ను రూ.2,000 ఆఫర్‌తో పొందవచ్చు. ఎలాగంటే.. ఎస్బిఐ కార్డ్, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్‌ ఉండనుంది.

వాచీ ఫీచర్స్‌… వన్‌ప్లస్ వాచ్ 1.39 అంగుళాల 2.5 డి కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లేతో 326, STM32 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 1GB RAM.. 4GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌, 402 ఎంఏహెచ్ బ్యాటరీ, పట్టిలేకుండా 45 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. దీంతోపాటు అనేక రకాల ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. యాపిల్‌ లాగానే వన్‌ ప్లస్‌లో ట్రాకింగ్‌, హెల్త్‌, నావిగేషన్‌ ఫీచర్స్‌ ఉన్నాయి.

Also Read:

REALME C20: తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే రియల్‌ మీ బెస్ట్‌ ఆప్షన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..