Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Investment: రూ.1.80 లక్షల పెట్టుబడితో రెండు కోట్ల రాబడి.. ఆ స్కీమ్‌లో పెట్టుబడితో సాధ్యమే..!

భారతదేశంలో ఏళ్లుగా పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే కోరికతో చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇల్లు అమ్మినప్పుడో? రిటైర్ అయిన తర్వాత మనవళ్ల భవిష్యత్ కోసం ఎక్కువగా సొమ్ము వచ్చినప్పుడు చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పథకాలు కాకుండా రూ.1.80 లక్షల పెట్టుబడి పెడితే రిటైర్ అయ్యాక కోట్లల్లో రాబడి వచ్చే స్కీమ్ గురించి తెలుసుకుందాం.

SIP Investment: రూ.1.80 లక్షల పెట్టుబడితో రెండు కోట్ల రాబడి.. ఆ స్కీమ్‌లో పెట్టుబడితో సాధ్యమే..!
Investment Plan
Follow us
Srinu

|

Updated on: Mar 26, 2025 | 4:04 PM

పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉంటే రాబడి అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులను ఖర్చు చేయకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు చిన్న పెట్టుబడి నుంచి పెద్ద కార్పస్ సృష్టించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఆధారంగా పెట్టుబడి వ్యవధి మారవచ్చు. అయితే  దీర్ఘకాలిక పెట్టుబడికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న నెలవారీ లేదా ఒకేసారి పెట్టుబడితో కూడా పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టే వారు వారిక 18వ ఏట రూ.1.80 లక్షలు డిపాజిట్ చేస్తే వారు రిటైర్ అయ్యే సమయానికి ఏకంగా రూ.2.10 కోట్లకు పైగా పదవీ విరమణ నిధిని పొందవచ్చని పేర్కొంటున్నారు. 

రూ. 5,000 నెలవారీ ఎస్ఐపీ

ఒక వ్యక్తి నెలకు రూ.5,000 ఎస్ఐపీతో పెట్టుబడితో ప్రారంభించి వారి పెట్టుబడులపై 13 శాతం వార్షిక రాబడిని పొందితే 15 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ. 9,00,000 అవుతుంది. అలాగే మూలధన లాభాలు రూ. 16,92,624గా ఉంటే మొత్తం రూ. 25,92,624 చేతికి అందుతుంది. 25 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ. 15,00,000గా ఉంటే రూ. 84,82,392 మూలధన లాభంగా వస్తుంది. అంటే రాబడి రూ. 99,82,392 అవుతుంది. నెలకు రూ.5 వేలు చొప్పున 35 సంవత్సరాలలో పెట్టుబడి పెడితే రూ. 21,00,000. ఈ పెట్టుబడిపై అంచనా వేసిన మూలధన లాభాలు రూ. 3,29,67,459గా ఉంటుంది. అంటే దాదాపు రిటైర్ అయ్యే సమయానికి రూ. 3,50,67,459 పొందవచ్చు. 

రూ. 7,50,000 వన్-టైమ్ డిపాజిట్‌తో రూ. 2.25 కోట్ల రాబడి

రూ. 7,50,000 వన్-టైమ్ డిపాజిట్‌ చేస్తే 10 సంవత్సరాలలో, అంచనా వేసిన మూలధన లాభాలు రూ. 15,79,386 వస్తుంది. కార్పస్ కూడా రూ. 23,29,386 అవుతుంది. 20 సంవత్సరాలలో అయితే మూలధన లాభాలు రూ. 64,84,720గా ఉంటే రూ. 72,34,720 చేతికి వస్తుంది. 30 సంవత్సరాల్లో మూలధన లాభాలు రూ. 2,17,19,942గా ఉంటే రూ. 2,24,69,942 రాబడి వస్తుంది. 

ఇవి కూడా చదవండి

రూ.1.80 లక్షల పెట్టుబడితో 

సాధరణంగా పదవీ విరమణ వయస్సుగా 60 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మీకు 18 ఏళ్ల సమయంలో రూ.1.80 లక్షల పెట్టుబడి పెడితే రూ.2,08,30,164.72 మూలధన లాభాలు వస్తాయి. అయితే అంచనా వేసిన కార్పస్ రూ.2,10,10,164.72గా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..