అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 7 టి
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ 7 టీ సిరీస్‌ను లాంచ్ చేయబోతోంది. రాత్రి 7 గంటలకు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7 టీ ప్రో, వన్ ప్లస్ టీవీలను విడుదల చేయనుంది. ఈ ఏడాది మేలో విడుదలైన వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రోలకు సక్సెసర్ వర్షన్లుగా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ మోడల్స్‌ను మనముందుకు తీసుకొస్తోంది వన్‌ప్లస్. ఆండ్రాయిడ్ 10 […]

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ 7 టీ సిరీస్‌ను లాంచ్ చేయబోతోంది. రాత్రి 7 గంటలకు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7 టీ ప్రో, వన్ ప్లస్ టీవీలను విడుదల చేయనుంది. ఈ ఏడాది మేలో విడుదలైన వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రోలకు సక్సెసర్ వర్షన్లుగా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ మోడల్స్‌ను మనముందుకు తీసుకొస్తోంది వన్‌ప్లస్. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రిలీజ్ కానున్న తొలి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ టి అన్న ప్రచారం జరుగుతోంది.
*ఈ రెండు మోడల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో లభించనున్నాయి వన్‌ప్లస్ 7టి ప్రో 8GB RAM, 256 GB ధర రూ.52,999 ఉండొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్ 7టి ప్రో 4,080 ఎంఎహెచ్ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌లో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, నాచ్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ వెర్షన్‌తో లభించనుంది. 48 మెగా పిక్సెల్-16మెగా పిక్సెల్, 12 మెగా పిక్సెల్ రియల్ కెమేరా, 1080X2340పిక్సెల్స్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. వన్‌ప్లస్ 7టి 3,800ఎంఎహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ధర రూ. 32,999
*వన్ ప్లస్ టీవీని కూడా లాంచ్ చేయబోతోంది వన్‌ప్లస్. వన్ ప్లస్ టీవీని 55 INCH, అల్ట్రా హెచ్‌డీతో తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ టీవీ మరో అద్భుతమైన ఫీచర్‌తో వస్తోంది. టీవీకి కనెక్టైన ఫోన్‌కు కాల్ వస్తే ఆటోమేటిక్‌గా టీవీ వాల్యూమ్ మారిపోయేలా డిజైన్ చేశారు. *అమెజాన్‌లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఇవి మొదటిసారి మార్కెట్‌లోకి రానున్నాయి. వీటిని ఉచితంగా గెలుచుకోవడానికి వన్ ప్లస్, అమెజాన్ ఒక అవకాశం కల్పిస్తోంది. అయితే దానికి మీరు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ టీవీ స్పెసిఫికేషన్లను సరిగా గెస్ చేయాలి. సరైన సమాధానమిస్తే మీరు వన్ ప్లస్ 7టిని గెలుచుకోవచ్చు.