AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క కాల్.. బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.13 లక్షలు మాయం.. టైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికే టోకరా!

ఈ రోజుల్లో రకరకాల సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా ఉంటే రెప్పపాటులోనే మోసం జరిగిపోతుంటుంది. మీకు తెలియకుండానే మీ అకౌంట్‌ ఖాళీ అయిపోతుంటుంది. సైబర్‌ మోసగాళ్లు ఓ టైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికే టోకరా వేశారు. ఆయన అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.13 లక్షలు మయం చేశారు..

ఒక్క కాల్.. బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.13 లక్షలు మాయం.. టైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికే టోకరా!
Subhash Goud
|

Updated on: Mar 03, 2025 | 3:38 PM

Share

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాల సంఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక కేసులు ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నాయి. అదే క్రమంలో చండీగఢ్‌కు చెందిన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి సురీందర్ కుమార్ కూడా ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు. వీడియో కాల్ ద్వారా అతన్ని రూ.13 లక్షల ఆన్‌లైన్ మోసానికి గురి చేశారు. మోసగాళ్ళు సీబీఐ, ముంబై పోలీసు అధికారులుగా నటిస్తూ వారిని మోసం చేశారు. ఈ మోసం కింద ఆ అధికారిని మనీలాండరింగ్ ఆరోపణల్లో ఇరికిస్తామని బెదిరించారు.

జనవరి 13న సురీందర్ కుమార్‌కు ఒక కాల్ వచ్చింది. అతని మొబైల్ నంబర్ 6 గంటల పాటు డిస్‌కనెక్ట్ చేయబడుతుందని చెప్పాడు. ఆందోళన చెందిన కుమార్ టెలికాం కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. అక్కడ ఒక వ్యక్తి తన పేరు మనీలాండరింగ్ కేసులో ఉందని చెప్పాడు. వీరిలో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ కూడా ఉన్నారు. ఈ కేసులో కుమార్ రూ. 56 లక్షలు లంచం తీసుకున్నారని కూడా ఆ వ్యక్తి ఆరోపించాడు. దీనితో పాటు, అతనిపై అనేక ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

వాట్సాప్ ద్వారా వీడియో కాల్:

మోసగాళ్ళు సురీందర్ కు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఇందులో పోలీసు యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి తనను తాను ముంబై పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని, మనీలాండరింగ్ ఆరోపణలపై సమాచారం కోరాడు. అతను సురీందర్‌ను అరెస్టు చేస్మని కూడా బెదిరించాడు. భయంతో సురీందర్ మోసగాళ్లకు సహకరించి వారికి డబ్బు పంపడానికి అంగీకరించాడు. దీని తర్వాత జనవరి 16న సురీందర్ తన HDFC బ్యాంకు ఖాతా నుండి మోసగాళ్ళు పేర్కొన్న ఖాతాకు రూ.6.5 లక్షలను బదిలీ చేశాడు.

ఇది కూడా చదవండి: Bank Account: ఈ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌!

రెండు రోజుల తర్వాత మళ్ళీ రూ. 6.7 లక్షలు బదిలీ చేయమని అడిగారు. దీని తర్వాత ఫిబ్రవరి 21న సురీందర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి,మొత్తం రూ.13.2 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నాడు. ఇది ఒకే కేసు కాదు.. ఇలాంటి సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీకు ఏదైనా తెలియని నంబర్ నుండి కాల్ వస్తే తెలివిగా వ్యవహరించండి.

ఇది కూడా చదవండి: March 31st Deadline: మార్చి 31 వరకు గడువు.. లేకుంటే ఇబ్బందులు తప్పవు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి