Ola S1X: రూ. 69వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీలు కూడా ప్రారంభం.. పూర్తి వివరాలు..

ఓలా ఎస్1ఎక్స్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ డెలివరీలను ఓలా ఇటీవల ప్రారంభించింది. ఇది ప్రస్తుతం ఓలా లైనప్ లో ఉన్న స్కూటర్లు అన్నింటిలోకి తక్కువ ధరకు లభ్యమవుతోంది. 2కేడబ్ల్యూ వేరియంట్ రూ. 69,999, 3కేడబ్ల్యూ రూ. 84,999, 4కేడబ్ల్యూ రూ, 99, 999 కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూం.

Ola S1X: రూ. 69వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీలు కూడా ప్రారంభం.. పూర్తి వివరాలు..
Ola S1x Electric Scooter
Follow us

|

Updated on: May 14, 2024 | 4:07 PM

ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో దేశంలోనే అగ్రశ్రేణి విక్రయదారుగా వెలుగుతోంది ఓలా ఎలక్ట్రిక్. తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే దాని ధర విషయంలోనూ వినియోగదారులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో అన్ని తరగతుల వారీగా అందుబాటులో ధరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసింది. ఓలా ఎస్1ఎక్స్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ డెలివరీలను ఓలా ఇటీవల ప్రారంభించింది. ఇది ప్రస్తుతం ఓలా లైనప్ లో ఉన్న స్కూటర్లు అన్నింటిలోకి తక్కువ ధరకు లభ్యమవుతోంది. 2కేడబ్ల్యూ వేరియంట్ రూ. 69,999, 3కేడబ్ల్యూ రూ. 84,999, 4కేడబ్ల్యూ రూ, 99, 999 కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూం. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో అన్ని స్కూటర్లలో కెల్లా ఇదే చవకైన స్కూటర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2కేడబ్ల్యూ వేరియంట్..

ఓలా ఎస్1 ఎక్స్ 2కేడబ్ల్యూ వేరియంట్ కు సంబంధించిన వివరాలను చూస్తే.. సింగిల్ చార్జ్ పై 91 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 7.4 గంటలు పడుతుంది. యాక్సలరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం 4.1 సెకండ్లలోనే గంటకు సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలో మోటార్ గరిష్ట పవర్ అవుట్ పుట్ 6కేడబ్ల్యూ ఉంటుంది. ఈ స్కూటర్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ స్కూటర్లో 3.5 అంగుళాల ఎల్సీడీ టచ్ స్క్రీన్ తో కూడిన ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

3కేడబ్ల్యూహెచ్, 4కేడబ్ల్యూహెచ్ వెర్షన్లు..

3కేడబ్ల్యూ వెర్షన్లో కూడా అదే చార్జింగ్ టైం, అవే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అయితే ఫీచర్ల విషయంలోనే కొన్ని అదనంగా యాడ్ అవుతాయి. అలాగే యాక్సలరేషన్ టైం, టాప్ స్పీడ్, రేంజ్ మారతాయి. 3కేడబ్ల్యూ వెర్షన్ 3.3 సెకండ్లలోనే 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరి సింగిల్ చార్జ్ పై 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో 4కేడబ్ల్యూహెచ్ వేరియంట్ గురించి చూస్తే 3కేడబ్ల్యూహెచ్ లో ఉన్న అన్ని అంశాలు ఉంటాయి. రేంజ్ మాత్రం అధికంగా ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అలాగే ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..