AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారా.? అయితే ఇది తెలుసుకోండి..!

నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లలో కేవలం రెండు నుంచి మూడు జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి.. అందులోనూ ఒకటి స్త్రీలకు కేటాయిస్తారు. వాటిలోను సుమారు రెండు రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాల కు చెందిన ప్రయాణికులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.. అందులో సీటు దొరికితే..

రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారా.? అయితే ఇది తెలుసుకోండి..!
Indian Railways
M Sivakumar
| Edited By: |

Updated on: May 14, 2024 | 3:24 PM

Share

నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లలో కేవలం రెండు నుంచి మూడు జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి.. అందులోనూ ఒకటి స్త్రీలకు కేటాయిస్తారు. వాటిలోను సుమారు రెండు రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాల కు చెందిన ప్రయాణికులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.. అందులో సీటు దొరికితే డోంట్ వరీ లేదంటే టాయిలెట్స్ దగ్గరరో లేదంటే జనాలు కూర్చునే సీట్ల క్రిందలో పడుకొని ప్రయాణం చేస్తూ వుంటారు.. అది లేదంటే ప్రమాదకరంగా తలుపుల దగ్గర పుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పుట్ బోర్డు ప్రయాణం ఎంత ప్రమాదమని హెచ్చరించిన చాలా మంది యువకులు ఆమాటలను పెడచెవిన పెడుతున్నారు.. సరదా పేరుతో పుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

రైళ్లలో చాలా మంది ప్రయాణికులు చాలా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. జనరల్ బోగిలలో కాలు కూడా పెట్టలేనతగా కిక్కిరిసిపోతాయి. అలానే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంచెం స్థలం దొరికితే రైలు తలుపుల దగ్గర కూర్చొని ప్రయాణం చేసిన సందర్భాలు ఉంటాయి.. అలా కూర్చొని సెల్ ఫోన్ చూడడం ,రైలు అప్పుడప్పుడు కుదుపులకు గురికావడంతో పుట్ బోర్డు దగ్గర ఉన్నవారు రైలు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా మంది యువకులు పుట్ బోర్డు ప్రయాణం చేసి రైలు నుండి కిందపడి తీవ్ర గాయలై మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలి. పుడ్ బోర్డు దగ్గర ఎవరు కూర్చొని ప్రయాణాలు చేయకుండా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.. అయితే రైలు పుడ్ బోర్డు ప్రయాణం చేయవద్దు అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కొందరు యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఇప్పుడున్న రెండు నుంచి ఐదుకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ , సూపర్ ఫాస్ట్ రైళ్లలో రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్య రైళ్లలో రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. వారికి సరిపడా జనరల్ బోగీలు లేక తొక్కిసలాటలు , ఫుట్ బోర్డు ప్రయాణం చేయడం సర్వ సాధారణంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.