Paytm: కొత్త వ్యాపారంలోకి పేటీఎం.. త్వరలో క్యాబ్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలు

స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికీ పరిచయం చేయనక్కర్లేని యాప్ పేటీఎమ్. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లు చేయడానికి వాడే నంబర్ వన్ యాప్ అని చెప్చవచ్చు. దీని యూజర్ల దేశంలో అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇటీవల ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం కుదేలైంది. అయినప్పటికీ తిరిగి పుంజుకునేందుకు పేటీఎం కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది.

Paytm: కొత్త వ్యాపారంలోకి పేటీఎం.. త్వరలో క్యాబ్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలు
Paytm
Follow us

|

Updated on: May 14, 2024 | 5:37 PM

ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ద్వారా ఆటో రిక్షా బుకింగ్ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఆటో రిక్షా రైడ్ లను అందించేందుకు రైడ్ హెయిలింగ్ మార్కెట్ లోకి అడుగుపెడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డిజిటల్ పేమెంట్ యాప్..

స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికీ పరిచయం చేయనక్కర్లేని యాప్ పేటీఎమ్. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లు చేయడానికి వాడే నంబర్ వన్ యాప్ అని చెప్చవచ్చు. దీని యూజర్ల దేశంలో అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇటీవల ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం కుదేలైంది. అయినప్పటికీ తిరిగి పుంజుకునేందుకు పేటీఎం కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. పెద్దసంఖ్యలో ఉన్న యూజర్లు తనకు ప్లస్ పాయింట్ మారే అవకాశం ఉందని భావిస్తోంది.

పరీక్షల స్థాయిలో ఫీచర్..

ఈ కొత్త ఫీచర్ పరీక్షల స్థాయిలో ఉంది. చాలా తక్కువ మంది పేటీఎమ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే రైడ్ హెయిలింగ్ లో ఓలా, ఉబర్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వాటికి పేటీఎం సవాలు విసురుతుందని భావిస్తున్నారు. పేటీఎం ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులతో తన యాప్‌లో రైడ్ హెయిలింగ్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. తదుపరి దశలో క్యాబ్ బుకింగ్ సేవలను కూడా అందించనుంది. గత రెండేళ్లలో ఓఎన్డీసీలో ఫుడ్ డెలివరీ, కిరాణా, ఫ్యాషన్,ఎలక్ట్రానిక్స్ వంటి అనేక ఇ-కామర్స్ ఆఫర్‌లను పేటీఎం ప్రయోగాత్మకంగా ప్రారంభించి, విడుదల చేసింది.

నమ్మయాత్రికి అనుసంధానం..

పేటీఎం యాప్‌లో బుక్ చేసిన ఆటో రిక్షాలు ఓఎన్డీసీ మద్దతు కలిగిన నమ్మ యాత్రి యాప్ కు అనుసంధానం చేశారు. ఇది సంప్రదాయ కమీషన్ విధానానికి విరుద్ధంగా డ్రైవర్ భాగస్వాములకు చందా రుసుముతో తన సేవలను అందిస్తుంది. నమ్మయాత్రి గత రెండేళ్లలో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా,ఇతర మెట్రోలతో సహా ఏడు నగరాల్లో 3.73 కోట్ల రైడ్‌లను అందించింది. వీటిలో ఎక్కువ భాగం ఆటో రైడ్‌లు. నగరాల్లో క్యాబ్ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది.

ఓఎన్డీసీ అంటే?

ఓఎన్డీసీ అనేది ఓపెన్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీ నెట్‌వర్క్. అలాగే మొబిలిటీ, గ్రోసరీ, ఫుడ్ ఆర్డర్, డెలివరీ, హోటల్ బుకింగ్, ప్రయాణం వంటి విభాగాల్లో సేవలు అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ లో కొనుగోలుదారులు, విక్రేతలు ఏ ఇతర అప్లికేషన్లను వాడినా ఆన్‌లైన్‌లో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే లావాదేవీలు నిర్వహించడానికి కూడా అనుమతి ఉంది. కొనుగోలుదారులు, విక్రేతలు లావాదేవీలను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫారమ్, అదే మొబైల్ యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వివిధ అప్లికేషన్లను ఉపయోగించి వ్యాపార లావాదేవీలు చేయవచ్చు.

2022లో ప్రారంభం..

నమ్మ యాత్రి యాప్ 2022లో ప్రారంభమైంది. సుమారు 2.1 లక్షల మందికి పైగా డ్రైవర్లు, 50 లక్షల మంది కస్టమర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, కోల్‌కతాతో సహా ఏడు నగరాల్లో 3.3 కోట్లకు పైగా ట్రిప్పులను పూర్తి చేసింది. దేశంలో ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి గూగుల్ మ్యాప్స్, ఓఎన్డీసీతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్