OLA Electric: ఓలా నుంచి క్రేజీ అప్ డేట్.. త్వరలో రిమూవబుల్ బ్యాటరీలతో ఈవీలు.. హీరో విడాకు గట్టి పోటీ తప్పదిక..
దేశంలో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఫీచర్ల పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నప్పటికీ రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ చాలా తక్కువగా ఉంది. హీరో కంపెనీ బ్రాండ్ అయిన విడా వీ1 స్కూటర్ లో మాత్రమే రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ప్రముఖ బ్రాండ్లు గా భావించే ఏథర్, టీవీఎస్, బజాజ్, ఓలా తదితర బ్రాండ్ల స్కూటర్లు ఇప్పటి వరకూ ఈ ఆప్షన్ పై ఆసక్తి చూపలేదు.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఈవీ సెక్టార్ పరిధిలో తన మార్కెట్ ను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా రిమూవబుల్ బ్యాటరీ (తొలగించగల బ్యాటరీ) పేటెంట్ ను పొందింది. త్వరలో ఓలా నుంచి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నట్టు సమాచారం. అయితే దీనిని త్రీ వీలర్లకు కూడా పరిచయం చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రిమూవబుల్ బ్యాటరీ పేటెంట్..
దేశంలో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఫీచర్ల పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నప్పటికీ రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ చాలా తక్కువగా ఉంది. హీరో కంపెనీ బ్రాండ్ అయిన విడా వీ1 స్కూటర్ లో మాత్రమే రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ప్రముఖ బ్రాండ్లు గా భావించే ఏథర్, టీవీఎస్, బజాజ్, ఓలా తదితర బ్రాండ్ల స్కూటర్లు ఇప్పటి వరకూ ఈ ఆప్షన్ పై ఆసక్తి చూపలేదు. కొత్తగా ఓలా కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ పేటెంట్ పొందడంతో దాని నుంచి ఈ ఆప్షన్ లో కొత్త స్కూటర్లు విడుదల కానన్నాయని భావిస్తున్నారు.
గతంలోనే..
ఓలా కంపెనీకి రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ కొత్త కాదు. గతంలో డచ్ స్టార్టప్ ఎటర్గో (యాప్ స్కూటర్)ను కొనుగోలు చేసినప్పుడు దానిలో ఉండేది. ఆ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ సెటప్ తో వచ్చేది. అయితే భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ ను మార్పు చేసినప్పుడు ఓలా దానిని తొలగించింది. తన ఎస్ 1 స్కూటర్ కు పర్మినెంట్ బ్యాటరీ ని డిజైన్ చేసింది. అయితే కాల క్రమేణా వచ్చిన మార్పులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీని మళ్లీ పరిచయం చేయనుంది.
ఎంతో ఉపయోగం..
రిమూవబుల్ బ్యాటరీలను ఏ రకమైన వాహనాలను వినియోగిస్తుందో ఓలా నుంచి కచ్చితమైన సమాచారం లేదు. కానీ తేలికగా ఉండే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలలో వాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రిమూవబుల్ బ్యాటరీ లు పట్టణ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటాయి. పట్టణాలలో అపార్ట్ మెంట్ల లోనే ప్రజలు జీవిస్తారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కింద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అలాంటప్పుడు వారికి బండిని చార్జింగ్ చేసుకోవడం కుదరదు. రిమూవబుల్ బ్యాటరీలను బండి నుంచి బయటకు తీసి, తమ ఫ్లాట్ లోకి తీసుకువెళ్లి చార్జింగ్ చేసుకోవచ్చు. అనంతర వాటిని బండిలో సులభంగా అమర్చుకునే వీలుంటుంది.
మార్కెట్ లో పోటీ..
ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ బైక్ లు, కార్లు, రిక్షాల ఉత్పత్తిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే వేటిలో కొత్త టెక్నాలజీ వాడుతుందో సమచాారం లేదు. ఏది ఏమైనప్పటికీ రిమూవబుల్ బ్యాటర్ వాహనాలతో మిగిలిన కంపెనీలకు ఓలా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
పెరిగిన వినియోగం..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దేశంలో విపరీతంగా పెరుగుతోంది. మార్కెట్ వాటి కొనుగోళ్లు జోరందుకున్నాయి. మారుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటి వాడకం పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారి అవసరాలను అనుగుణంగా ప్రముఖ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలలో అనేక కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నాయి. రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ కూడా ఇందులో భాగంగా వచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




