AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola: ‘ఓలా’ కంపెనీ సంచలన నిర్ణయం.. కొత్త వ్యాపారంలోకి అడుగులు!

ఓలా కంపెనీ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. అందుకోసం ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఓలా క్యాప్‌ సర్వీసులను అందిస్తున్న సంస్థ.. ఇప్పుడు కిరాణా డెలివరీ కంపెనీలోకి ప్రవేశించబోతోంది. దీని కోసం డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ (ONDC)ని ఎంచుకుంది. ఈ సేవ త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో కిరాణా డెలివరీ

Ola: 'ఓలా' కంపెనీ సంచలన నిర్ణయం.. కొత్త వ్యాపారంలోకి అడుగులు!
Ola
Subhash Goud
|

Updated on: Jul 09, 2024 | 11:45 AM

Share

ఓలా కంపెనీ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. అందుకోసం ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఓలా క్యాప్‌ సర్వీసులను అందిస్తున్న సంస్థ.. ఇప్పుడు కిరాణా డెలివరీ కంపెనీలోకి ప్రవేశించబోతోంది. దీని కోసం డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ (ONDC)ని ఎంచుకుంది. ఈ సేవ త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో కిరాణా డెలివరీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ-NCR సహా మెట్రో నగరాల్లో ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా మంది వ్యక్తులు ఫోన్ కాల్ లేదా యాప్ ద్వారా ఆర్డర్ చేయడం ద్వారా ఇంట్లో కూర్చొని సరుకులను డెలివరీ చేయవచ్చు. Blinkit, Bi Basket వంటి అనేక యాప్‌లు ఉన్నాయి.

Olaకి కిరాణా డెలివరీ కొత్త కాదు ..

అయితే ఓలాకి కిరాణా డెలివరీ కొత్త కాదు. 2015 సంవత్సరంలో ఓలా బెంగళూరులో ఒక స్వతంత్ర ఆన్‌లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ యాప్ కూడా ఈ ఏడాది ప్రారంభించింది. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే క్యాబ్‌లు, డ్రైవర్లు ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు కిరాణా సామాగ్రిని పంపిణీ జరుగుతోంది. అయితే, ఈ సేవ ప్రారంభించిన కొద్ది నెలలకే నిలిపివేసింది. దీని తరువాత 2012 సంవత్సరంలో ఓలా వెంచర్ ఓలా డాష్ పేరుతో ముంబై, బెంగళూరులో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. అందులో దాదాపు 15 దుకాణాలు ఉండేవి. 1 సంవత్సరం తర్వాత ఈ సేవ కూడా అకస్మాత్తుగా నిలిపివేసింది.

ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫారమ్ అంటే ఏమిటి?

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) అనేది భారత ప్రభుత్వం చొరవ. ఇ-కామర్స్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఓఎన్‌డీసీ లక్ష్యం న్యాయమైన పోటీని ప్రోత్సహించడం. ఇది చిన్న వ్యాపారాలకు కూడా ఉపయోగపడుతుంది. మార్కెట్‌లో ఉన్న పెద్ద వ్యాపారులతో పోటీ పడటానికి ఎక్కువ డబ్బు, వనరులు లేని వారు ఈ ప్లాట్‌ఫారమ్ సహాయం తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి