Mercedes Benz EQA: మార్కెట్లోకి కొత్త ఈవీ.. కేవలం రూ. 66లక్షలకే లగ్జరీ ఎస్‌యూవీ..

బెంజ్ కూడా ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరిట మన దేశంలోని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 66లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ జర్మన్ లగ్జరీ కార్ మేకర్ నుంచి వస్తున్న ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. ఈక్యూబీ, ఈక్యూఈ, ఈక్యూఎస్ వంటి సబ్ వేరియంట్లను లైనప్ లో ఉంచింది.

Mercedes Benz EQA: మార్కెట్లోకి కొత్త ఈవీ.. కేవలం రూ. 66లక్షలకే లగ్జరీ ఎస్‌యూవీ..
Mercedes Benz Eqa Electric Suv
Follow us

|

Updated on: Jul 09, 2024 | 3:06 PM

లగ్జరీ కార్ల బ్రాండ్లలో మెర్సిడెస్ బెంజ్ ప్రసిద్ధి చెందింది. ఇది చాలా కాలం నుంచి ప్రీమియం కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు అన్ని కంపనీలు ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నాయి కాదా.. ఇదే క్రమంలో బెంజ్ కూడా ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరిట మన దేశంలోని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 66లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ జర్మన్ లగ్జరీ కార్ మేకర్ నుంచి వస్తున్న ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. ఈక్యూబీ, ఈక్యూఈ, ఈక్యూఎస్ వంటి సబ్ వేరియంట్లను లైనప్ లో ఉంచింది. ఈ కొత్త బెంజ్ ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సీ 40 రీచార్జ్, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, కియా ఈవీ6, హ్యూందాయ్ ఐయనిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ కారు ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెట్రోల్ వేరియంట్ జీఎల్ఏ ఎస్‌యూవీ మోడల్లోనే ఉంటుంది. ఇప్పటికే భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామిగా ఉంది. ఈక్యూఏ ప్రారంభించడంతో, ఆ స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ డిజైన్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇప్పటికే ఐసీఈ వేరియంట్ అయిన జీఎల్ఏను పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ స్టైలిష్ గా ఉంటుంది. త్రీ-పాయింటెడ్ స్టార్ ఎలిమెంట్లను అలంకరించిన సంప్రదాయ గ్రిల్స్ స్థానంలో ఒక క్లోజ్డ్ ఫ్రంట్ ప్యానెల్, సిగ్నేచర్ ఎల్ఈడీ హెడ్లైట్లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్, బ్యాటరీ ప్యాక్ ను చల్లబరచడానికి ఎయిర్ వెంట్లతో రీడిజైన్ చేసిన బంపర్లు ఉంటాయి. ఈక్యూఏ సైడ్ ప్రొఫైల్ ఈవీ-నిర్దిష్ట అల్లాయ్ వీల్స్ తో రీడిజైన్ చేశారు. ఎస్యూవీ వెనుక ప్రొఫైల్ విలక్షణమైన రూపాన్ని పొందుతుంది. ఇది ఇప్పటికే భారతదేశంలో విక్రయించబడుతున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీలో కనిపించే విధంగా కనెక్ట్ చేసిన టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఎస్ యూవీ ఏడు విభిన్న రంగులలో లభిస్తుంది. ఇది కూడా చదవండి:

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఫీచర్లు..

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ కారు కొత్త క్యాబిన్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ లేఅవుట్ను పోలి ఉంటుంది. కానీ కొన్ని ఈవీ-నిర్దిష్ట డిజైన్ జోడింపులతో ఉంటుంది. వీటిలో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీలో కూడా కనిపించే విధంగా, డాష్ బోర్డ్ పై ఇల్యూమినేటెడ్ స్టార్లు, కాపర్-ఫినిష్డ్ ఇల్యూమినేటెడ్ ఏసీ వెంట్లు, ట్రిమ్లు ఉన్నాయి. ఇది వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో డ్యూయల్ 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సెటప్ను కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్, హెడ్స్-అప్ డిస్ ప్లే, కీలెస్ ఎంట్రీ, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ ఆడియో సిస్టమ్, గెస్చర్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్లు, పనోరమిక్ సన్రూఫ్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ స్పెసిఫికేషన్స్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ 187 బీహెచ్పీ పీక్ పవర్, 385 ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోటార్తో జసిన 70.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 560-కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. మన దేశంలో ఈక్యూఏ 250 ప్లస్ ట్రిమ్ ఒక్కటే అందుబాటులో ఉంది. కాగా మరో రెండు వేరియంట్లో ఇతర దేశాలలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి భారతదేశానికి వాటిని తీసుకురావడం లేదు. ఈ కారు గరిష్టంగా గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 8.6 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎలక్ట్రిక్ ఎస్ యూవీ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 7.4 కేడబ్ల్యూ, 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. డీసీ ఛార్జర్ 35 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ భద్రతా ఫీచర్లు..

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ విస్తృత శ్రేణి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. వీటిలో బహుళ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హెూల్డ్, హిల్-డీసెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, పార్కింగ్ అసిస్ట్, బ్లైండ్ వంటి అదనపు అడాస్ ఫీచర్లు ఉన్నాయి. స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలోని బ్యాంకులు మీకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులు మీకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా?
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
పాకిస్తాన్‌లో వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి..
పాకిస్తాన్‌లో వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి..
నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు
నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు
ఎన్నో ఏళ్లుగా పూజించిన పామే ప్రాణం తీసింది!
ఎన్నో ఏళ్లుగా పూజించిన పామే ప్రాణం తీసింది!
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నైట్‌ ఔట్.. కట్‌చేస్తే..
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నైట్‌ ఔట్.. కట్‌చేస్తే..
స్త్రీ లక్షణాలు చెప్పిన చాణక్య పురుషుల కంటే స్త్రీలే తెలివైన వారట
స్త్రీ లక్షణాలు చెప్పిన చాణక్య పురుషుల కంటే స్త్రీలే తెలివైన వారట
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్..
మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్..
జన్మాష్టమి రోజున ఏర్పడనున్న జయంతి యోగా.. ఈ సమయంలో పూజ శుభప్రదం..
జన్మాష్టమి రోజున ఏర్పడనున్న జయంతి యోగా.. ఈ సమయంలో పూజ శుభప్రదం..
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
1500 కిలోల భారీ చేప. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.
1500 కిలోల భారీ చేప. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.
పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..