Ola S1 Stunt: ఓలా ఎస్1 స్కూటర్ ఒక బీస్ట్! విమర్శలన్నింటికీ ఒక్క వీడియోతో చెక్.. ఆరుగురిని సునాయాసంగా..
ముఖ్యంగా ఓలా ఎస్ 1 స్కూటర్ ఫోర్క్ నాణ్యతపై సందేహాలు, సోషల్ మీడియాలో విమర్శల కారణంగా ఎస్1 స్కూటర్లను అన్నింటినీ రీకాల్ చేసింది. మరింత నాణ్యతతో కూడిన ఫోర్క్ ను ఇప్పుడు స్కూటర్ కు అమర్చింది. అంతే కాక దీనిని టెస్ట్ డ్రైవ్ చేసి, ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఓలా ఓ ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకూ కనీవినీ ఎరుగని అనేక అత్యాధునిక ఫీచర్లతో టూ వీలర్లను తీసుకొచ్చి వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ టూవీలర్ మార్కెట్లో మన దేశం మాత్రమే కాక, ప్రపంచ వ్యాప్తంగా టాప్ పొజిషన్ లో ఉంది. అటువంటి ఓలా కంపెనీ ఇటీవల తమ ఉత్పత్తుల నాణ్యతపై పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఓలా ఎస్ 1 స్కూటర్ ఫోర్క్ నాణ్యతపై సందేహాలు, సోషల్ మీడియాలో విమర్శల కారణంగా ఎస్1 స్కూటర్లను అన్నింటినీ రీకాల్ చేసింది. మరింత నాణ్యతతో కూడిన ఫోర్క్ ను ఇప్పుడు స్కూటర్కు అమర్చింది. కస్టమర్లు ఉచితంగా అమర్చిన బీఫియర్ ఫ్రంట్ ఫోర్క్ యూనిట్‌ను పొందారు. ఈ కొత్త ఫోర్క్ తీవ్రమైన పరిస్థితులను తట్టుకుంటుందని.. చాలా ఎక్కువ ఎఫ్ఓఎఫ్ (ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ) ఉందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. అంతే కాక దీనిని టెస్ట్ డ్రైవ్ చేసి, ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిని చూసిన నెటిజనులు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్టంట్ వీడియో ఇలా..
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్ కొత్త ఫ్రంట్ ఫోర్క్ దృఢత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ స్టంట్ వీడియోను షేర్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో, ఆరుగురు వ్యక్తులు ఓలా ఎస్1 స్కూటర్‌పై ప్రయాణించారు. అది కూడా ఉపరితలం సరిగా లేని రోడ్డుపై. ఆరుగురు యువకులు హెల్మెట్లు ధరించి ఈ స్టంట్ లో పాల్గొన్నారు. ఇది ఫ్రంట్ ఫోర్క్ బలాన్ని ప్రదర్శించడానికి చేసినట్లు ఉంది. ఆ వీడియో చివరలో బిల్ట్ టు పర్ఫేక్షన్ అని హాష్ ట్యాగ్ ఉంది.



ఇది ఒక బీస్ట్..
ఈ 17 సెకండ్ల వీడియో గురించి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేస్తూ ‘వావ్.. నేను చూసిన స్కూటర టెస్టింగ్ లలో అత్యంత కఠినమైన ఇదే. ఓలా ఎస్1 ఒక బీస్ట్’ అని అన్నారు.
Wow! The toughest stress test I’ve seen of any scooter till date!
Ola S1 is a beast ? pic.twitter.com/xca2A06AP9
— Bhavish Aggarwal (@bhash) April 17, 2023
చాలా ఫిర్యాదులు..
ఓలా ఫ్రంట్ ఫోర్క్ ఇష్యూపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దురదృష్టం వెంటాడితే ప్రాణనష్టం కూడా సంభవించవచ్చు. ఈ సింగిల్-సైడ్ ఫోర్క్ స్కూటర్ కుడి వైపున ఫోటోజెనిక్ కోణాన్ని అందిస్తుంది. అయితే ఓలా కంపెనీ వీటిని ఉచితంగా రీకాల్ చేసి కొత్త దాన్ని అమర్చింది. అయితే వినియోగదారులు ఈ సింగిల్ సైడెడ్ ఫోర్క్ స్థానంలో ఓలా S1 ఎయిర్‌లో ఉండే ట్విన్ ఫోర్క్ సెటప్‌ను పొందుతామని భావించారు. కానీ కంపెనీ అదే సింగిల్ సైడెడ్ ఫ్రంట్ ఫోర్క్ యూనిట్ మరింత ధృడంగా అందించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




