Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola S1 X+ Electric Scooter: ఓలా నుంచి కొత్త స్కూటర్‌ వచ్చేసింది.. సింగిల్‌ చార్జ్‌పై 151కి.మీ.. ధర ఎంతంటే..

అయితే ఓలా ఈ ఏడాది ఆగస్టులోనే తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల లైనప్‌ ను కొత్త స్కూటర్లతో రీ వ్యాంప్ చేసింది. వాటిల్లో ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ స్కూటర్‌ ఒకటి. దీనికి కొంతకాలం క్రితమే ప్రదర్శించగా.. ఇప్పుడు డీలర్ల వద్ద అందుబాటులోకి వచ్చింది. అధికారిక వినియోగదారులకు కొనుగోలుకు అవకాశం ఏర్పడింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మీ సమీపంలోని ఓలా డీలర్‌వద్దకు వెళ్లి స్కూటర్‌ ని టెస్ట్‌ రైడ్‌ చేయొచ్చు. దీని ధర రూ. 1,09,999 ఎక్స్‌ షోరూం ఉంటుంది.

Ola S1 X+ Electric Scooter: ఓలా నుంచి కొత్త స్కూటర్‌ వచ్చేసింది.. సింగిల్‌ చార్జ్‌పై 151కి.మీ.. ధర ఎంతంటే..
Ola S1 X+ Electric Scooter
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2023 | 4:00 PM

ఓలా ఎలక్ట్రిక్‌.. మన దేశంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన శ్రేణిలో తిరుగులేని విధంగా మార్కెట్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలలో దేశంలోనే నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది. దీనికి పోటీగా దరిదాపుల్లో మరేది లేదంటే ఓలా డామినేషన్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ ఈ ఏడాది ఆగస్టులోనే తన స్కూటర్ల లైనప్‌ ను కొత్త స్కూటర్లతో రీ వ్యాంప్ చేసింది. వాటిల్లో ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ స్కూటర్‌ ఒకటి. దీనికి కొంతకాలం క్రితమే ప్రదర్శించగా.. ఇప్పుడు డీలర్ల వద్ద అందుబాటులోకి వచ్చింది. అధికారిక వినియోగదారులకు కొనుగోలుకు అవకాశం ఏర్పడింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మీ సమీపంలోని ఓలా డీలర్‌వద్దకు వెళ్లి స్కూటర్‌ ని టెస్ట్‌ రైడ్‌ చేయొచ్చు. దీని ధర రూ. 1,09,999 ఎక్స్‌ షోరూం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్‌ ఓలా ఎస్‌1 ఎక్స్‌ప్లస్‌ స్కూటర్‌ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ సామర్థ్యం.. ఓలా ఎస్‌ ఎక్స్‌1 ప్లస్‌ స్కూటర్‌లో 3కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 151కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేయగలుగుతందని కంపెనీ ప్రకటించింది. అయితే వాస్తవ రూపంలో ఎకో మోడ్లో డ్రైవ్‌ చేస్తే 125 కిలోమీటర్లు, నార్మల్‌ మోడ్లో రైడ్‌ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ ఇంట్లోని 500కిలోవాట్‌ హోమ్‌ చార్జర్‌తో చార్జ్‌ చేస్తే ఫుల చార్జ్‌ అవడానికి 7.4 గంటలు పడుతుంది.

మోటార్‌ సామర్థ్యం.. ఈ స్కూటర్‌లో 2.7కేడబ్ల్యూ నామినల్‌ పవర్‌, 6కేడబ్ల్యూ పీక్‌ పవర్‌ ను అందించే మోటార్‌ ఉంటుంది. దీని సాయంతో ఇది గరిష్టంగా గంటకు 90కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలుతుంది. ఇది కేవలం సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకండ్లలోనే అందుకుంటుంది. అదే విధంగా సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకండ్లలోనే చేరుకుంటుంది. దీనిలో స్పోర్ట్స్‌ మోడ్‌ ను కూడా ఓలా ప్రత్యేకంగా అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఫీచర్లు.. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైటింగ్‌, సైడ్‌ స్టాండ్‌ అలర్ట్‌, రివర్స్‌ మోడ్‌, రిమోట్‌ బూట్‌ అన్‌లాక్‌, నావిగేషన్‌, ప్రోటెక్టివ్‌ మెయింటెనెన్స్‌ వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే ఓటీఏ అప్‌డేట్లు, బ్లూటూత్‌, జీపీఎస్‌ కనెక్టివిటీ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజైన్‌ అండ్‌ లుక్‌.. ఈ స్కూటర్‌ ఇంతకు ముందు ఉన్న ఓలా స్కూటర్ల కన్నా లుక్స్‌పరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొత్త కోవల్‌ హెడ్‌ ల్యాంప్‌, సర్క్యులర్‌ మిర్రర్స్‌ ఉంటాయి. ముందు, వెనుక డ్రమ్‌ బ్రేకులు ఉంటాయి. అల్లాయ్‌ వీల్స్‌ఉంటాయి. ముందువైపు ట్విన్‌ టెలి స్కోపిక్‌ యూనిట్లు, డ్యూయల్‌ షాక అబ్జర్బార్‌ ఉంటాయి. కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌తో ఈ స్కూటర్‌ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..