AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. మన దేశంలో భారీగా చమురు నిల్వలు లభ్యం! ఎక్కడంటే..?

రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్ ముడి చమురు ఉత్పత్తిలో అద్భుత రికార్డు సృష్టించింది. బాగేవాలా క్షేత్రంలో ఉత్పత్తి 70 శాతం పెరిగి, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో, CSS వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి భారీ చమురును విజయవంతంగా వెలికితీస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. మన దేశంలో భారీగా చమురు నిల్వలు లభ్యం! ఎక్కడంటే..?
Bikaner Nagaur Basin
SN Pasha
|

Updated on: Apr 06, 2026 | 7:00 AM

Share

రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుంచి దేశ ఇంధన రంగానికి ఊతమిచ్చే కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ బికనీర్-నాగౌర్ బేసిన్‌లో ముడి చమురు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఈ పురోగతి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, దిగుమతి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. బాగేవాలా క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు 1,202 బ్యారెళ్లకు చేరింది. ఇది గత సంవత్సరం నమోదైన 705 బ్యారెళ్లతో పోలిస్తే సుమారు 70 శాతం పెరుగుదల.

2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఉత్పత్తి 43,773 మెట్రిక్ టన్నులకు చేరగా, ఇది గత ఏడాది 32,787 మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా అధికం. వెలికితీసిన ముడి చమురును ట్యాంకర్ల ద్వారా ONGC మెహసానా కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ కోయాలి రిఫైనరీకి పంపిస్తున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఆధునిక సాంకేతికతల వినియోగం. థార్ ప్రాంతంలో లభించే భారీ (హెవీ) చమురు అత్యంత జిగటగా ఉండటం వల్ల సంప్రదాయ పద్ధతులతో వెలికితీత కష్టసాధ్యం.

దీనిని అధిగమించేందుకు ‘సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్ (CSS)’ వంటి ఉష్ణ ఆధారిత సాంకేతికతను వినియోగించారు. అదనంగా ఫిష్‌బోన్ డ్రిల్లింగ్, బేర్‌ఫుట్ కంప్లీషన్, ఎలక్ట్రిక్ హీటర్లు వంటి పద్ధతులు ఉత్పత్తిని వేగవంతం చేశాయి. 1991లో కనుగొనబడిన ఈ క్షేత్రంలో 2017లో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం 52 బావుల్లో 33 బావులు చురుకుగా పనిచేస్తుండగా, ఈ ఏడాది 13 కొత్త బావులను తవ్వడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us